Whatsapp New features: యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొచ్చే ప్రముక మెసేజింగ్ యాప్ వాట్సాప్.. త్వరలో మరికొన్ని ఫీచర్లను తీసుకురాబోతుంది. వాట్సాప్ 2.20.200.6 పేరుతో కొత్త వెర్షన్ అప్‌డేట్‌ని తీసుకురానుంది. ఇందులో వాల్‌పేపర్ డిమ్, స్టిక్కర్ ప్యాక్స్ ఉండనున్నాయి. అలాగే స్టోరేజ్‌కి చెందిన బగ్స్‌ను కూడా సరిచేసినట్లు వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. అయితే టెస్టింగ్ కోసం ఇది బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రానుందని, పరీక్షలు పూర్తైన తరువాత అందరికి అందుబాటులోకి రానుందని పేర్కొంది.
కాగా గతంలో వాట్సాప్ తీసుకొచ్చిన స్టోరేజ్ యూసేజ్ సెక్షన్ ఓపెన్ చేసినప్పుడు వాట్సాప్ క్రాష్ అవుతుందని యూజర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొత్త వెర్షన్‌లో ఈ లోపాన్ని సరిచేయనున్నారు. ఇక యుసాగ్యున్ పేరుతో కొత్త యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్ త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానుంది.
Read More: