Whats App: ఫేస్‌బుక్, వాట్సాప్ ఎగ్జిక్యూటివ్‌లు మార్క్ జుకర్‌బర్గ్, విల్ క్యాత్‌కార్ట్ ఇటీవల ‘వ్యూ వన్స్’ అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. దానికి అనుగుణంగానే తాజాగా ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో ఈ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది వాట్సప్. ఇప్పుడు ఎవరైనా ఒక ఫోటో వీడియో మెసేజ్ పంపితే, దానిని అందుకున్న వ్యక్తి ఒక్కసారి మాత్రమే చూడగలరు. ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకున్న వారు ఒక ఫోటో ఎవరికైనా పంపించారని అనుకుందాం.. అది అవతలి వారు చూసిన వెంటనే కనబడకుండా (డిజెప్పీర్) అయిపోతుంది. ఈ మెసేజ్ అందుకున్నవారికే కాదు.. పంపించిన వారి వాట్సప్ లోనూ ఇది కనిపించదు. ఇదే ఈ ఫీచర్ ప్రత్యేకత. కానీ, ఈ ఫీచర్ ను మెసేజ్ పంపిన ప్రతిసారి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అంటే, మీరు ఒకరికి ఫోటో లేదా వీడియో పంపిన తరువాత అవతలి వారు పదే పదే ఈ ఫోటో లేదా వీడియో చూసే అవసరం లేదు అని అనుకున్నపుడు ఈ ఫీచర్ ఎనేబుల్ చేసి ఫోటో లేదా వీడియో షేర్ చేయాల్సి ఉంటుంది.
ఈ ఫీచర్ గ్రూపులకు చక్కగా ఉపయోగపడుతుంది. అయితే, గ్రూపులోని సభ్యులందరూ మీరు షేర్ చేసిన ఫోటో లేదా వీడియో చూసేంతవరకూ ఇది కనిపిస్తుంది. ఒక్కసారి గ్రూప్ లో అందరూ చూసిన తరువాత ఆటోమేటిక్ గా కనిపించకుండా పోతుంది. ఇక ఆ ఫోటో లేదా వీడియో ఎవరు చూశారనే విషయం మెసేజ్ ఇన్ఫో సెక్షన్ లో కనిపిస్తుంది. గ్రూప్ లో ఎవరినైనా బ్లాక్ చేసి ఉన్నా కూడా ఈ వ్యూ వన్స్ ఫీచర్ ద్వారా మీరు పంపిన ఫోటో లేదా వీడియోలను చూసే ఛాన్స్ ఉంది.
Also Read: Vivo Y73: స్మార్ట్‌ఫోన్ ధర..ప్రీమియం ఫీచర్లు..కొత్త వివో వై 73..ఈ ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
Samsung Google: చేతులు కలిపిన శామ్‌సంగ్, గూగుల్.. అధునాతన ఫీచర్లతో కూడిన స్మార్ట్ వాచ్ కోసమే..