Facebook Hack: మీ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయితే వెంటనే ఇలా చేయండి!

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఫేస్‌బుక్, ఇన్‌స్టా వంటి ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ అకౌంట్స్‌లో చాలా ముఖ్యమైన పర్సనల్ ఫోటోలు, సమాచారాన్ని సేవ్ చేస్తుంటారు చాలామంది. మరి ఈ ప్లాట్‌ఫామ్స్ ఎప్పుడైనా హ్యాకర్ల చేతికి చిక్కితే ఏంటి పరిస్థితి?

Facebook Hack: మీ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయితే వెంటనే ఇలా చేయండి!
Facebook Hack

Updated on: Oct 03, 2025 | 5:17 PM

సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లే అప్పుడప్పుడూ హ్యాక్ అవుతుంటాయి. అలాంటిది సామాన్యుల అకౌంట్ల గురించి చెప్పేదేముంది. సైబర్ ఫ్రాడ్స్ లో భాగంగా చాలామంది సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అవుతుంటాయి. అకౌంట్స్ హ్యాక్ చేసి డబ్బు ఇవ్వమని బెదిరించడం, అర్జెంట్ గా డబ్బు సాయం కావాలని ఫ్రెండ్స్‌కు మెసేజ్ చేయడం వంటివి చేస్తుంటారు సైబర్ నేరగాళ్లు. ఇలా సోషల్ మీడియా అకౌంట్ వేరొకరి చేతిలోకి వెళ్లినప్పుడు ఏం చేయాలంటే..

వెంటనే ఇలా చేయాలి

  • ఇన్‌స్టాగ్రామ్‌ ఫేస్‌బుక్‌, ఎక్స్ .. ఇలా ఏదైనా సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయినప్పుడు ‘ఫర్‌‌గాట్ పాస్‌వర్డ్’పై నొక్కి వెంటనే పాస్‌వర్డ్ మార్చాలి. అన్ని యాక్టివ్ డివైజ్‌ల నుంచి అకౌంట్‌ను లాగవుట్ చేయాలి. తిరిగి పాస్‌వర్డ్ పెట్టేటప్పుడు నెంబర్, సింబల్‌తో కూడిన స్ట్రాంగ్ పాస్‌వర్డ్ పెట్టాలి.
  • ఒకవేళ హ్యాకర్లు పాస్‌వర్డ్ మార్చే వీలు లేకుండా మీ లాగిన్ డీటెయిల్స్ మార్చేస్తే.. మెటా లేదా ఎక్స్ హెల్ప్ లైన్ కు కాల్ చేసి రిపోర్ట్ చేయాలి. మీ డీటెయిల్స్‌ చెప్పి మీ అకౌంట్‌ను వెంటనే బ్లాక్ చేయమని అడగాలి. అకౌంట్ హ్యాకింగ్‌కు గురైనప్పుడు రిపోర్ట్ చేయటానికి ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేకంగా ఫీచర్లున్నాయి.
  • అకౌంట్ హ్యాక్ చేసిన హ్యాకర్లు మీ అకౌంట్ నుంచి మీ ఫ్రెండ్స్‌కు మెసేజ్‌ చేసి అర్జెంటుగా డబ్బు కావాలని అడుగుతుంటారు. కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ మీ అకౌంట్ హ్యాక్ అయిన విషయం తెలియజేయాలి. మెసేజ్‌లకు రిప్లై ఇవ్వొద్దని చెప్పాలి.

జాగ్రత్తలు ఇలా..

  • సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే.. ముందుగా పాస్‌వర్డ్‌ స్ట్రాంగ్‌గా పెట్టుకోవాలి. పాస్ వర్డ్ లో ఒక క్యాపిటల్ లెటర్, ఒక నెంబర్, ఒక సింబరల్ ఉండేలా చూసుకోవాలి.
  • లాగిన్ కోసం టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనే ఫీచర్ ను ఎనేబుల్ చేసుకోవాలి.
  • సోషల్ మీడియా యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూ ఉండాలి.
  • అకౌంట్ హ్యాక్ అయిందో లేదో గుర్తించేందుకు తరచూ లాగిన్ అయ్యి పోస్ట్‌లు, మెసేజ్‌లను చెక్ చేస్తుండాలి అలాగే మీ ప్రైవసీ సెట్టింగ్స్ ను కూడా తరచూ విజిట్ చేస్తుండాలి.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి