చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో ఇటీవల మార్కెట్లోకి వివో ఎక్స్ 90 ప్రో పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఈ ఫోన్‌లో మంచి ఫీచర్స్‌ను అందించారు. ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్‌తో పాటు మరెన్నో స్టన్నింగ్ ఫీచర్స్‌ను ఈ ఫోన్‌లో అందించారు.
ఈ స్మార్ట్ ఫోన్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 84,999కాగా, ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 10 వేల డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. నిజానికి ఈ స్మార్ట్ ఫోన్ లాంచింగ్ సమయంలో రూ. 90 వేలకు పైగా ఉంది. ఆఫర్‌లో భాగంగా రూ. 84,999కి తీసుకొచ్చారు. అయితే తాజాగా రూ. 10 వేల డిస్కౌంట్‌తో రూ. 74,999కి పొందే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒరిజినల్ బ్లాక్ షేడ్ కలర్‌లో అందుబాటులో ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్స్‌లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది.
ఇక వివో ఎక్స్90 ప్రో స్మార్ట్ ఫోన్ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ సొంతం. ఇక ఈ ఫోన్‌లో అక్టాకోర్ 4ఎన్‌ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ కూడా అందించారు.
కెమెరా విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో వివో ఎక్స్90 ప్రోలో ట్రిపుల్ సెటప్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. వీటిలో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్‌తో ఇచ్చారు. 12 మెగాపిక్సెల్‌తో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగాపిక్సెల్స్ పొర్‌ట్రెయిట్ సెన్సార్ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక ఈ ఫోన్‌లో 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్స్ వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 8 నిమిషాల్లోనే ఈ ఫోన్ 0 నుంచి 50 శాతం వరకు ఛార్జింగ్ అవుతుంది.
ఈ ఫోన్‌లో 4870 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 5జీ నెట్‌వర్క్‌కి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. వైఫై 6, బ్లూటూత్ వీ5.3, ఎన్ఎఫ్ఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. ఈ ఫోన్ బరువు 214.85 గ్రాములుగా ఉంది. యూఎస్‌బీ కేబుల్, ఛార్జర్, ఎజెక్ట్ టూల్, ఫోన్ కేస్ వంటి ఫీచర్స్‌ను అందించారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..