ఇటీవల కాలంలో సైబర్ దాడులు అధికమయ్యాయి. ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నా నేరగాళ్లు ఏదో రకంగా మాల్ వేర్ లను మన ఫోన్లలోకి పంపిస్తున్నారు. ఫలితంగా వినియోగదారులు ప్రైవసీ, డేటా మొత్తం చోరీకి గురవుతోంది. ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. ఇదే క్రమంలో ఇప్పుడు ఓ యాప్ ద్వారా మాల్ వేర్ మన ఫోన్లలో చొరబడుతోంది. అది అందరికీ తెలిసిన యాపే. దాని పేరు ఐ రికార్డర్(iRecorder – Screen Recorder). ప్రముఖ ఆండ్రాయిడ్ స్క్రీన్ రికార్డింగ్ యాప్ ఇది. దీని ద్వారా మాల్ వేర్ ఫోన్లలోకి చొరబడినట్లు సైబర్ సెక్యూరిటీ ఫిర్మ్ ఈసెట్(ESET) ప్రకటించింది. ఇది వినియోగదారులపై అనధికారికంగా నిఘా పెట్టినట్లు పేర్కొంది. సెన్సిటివ్ డేటాను దొంగిలిస్తున్నట్లు వివరించింది.
ఈ సందర్భంగా ఈసెట్ సెక్యూరిటీ రిసెర్చర్ లుకాస్ స్టెఫాన్కో మాట్లాడుతూ ఈ ఐరికార్డర్ మొదట లాంచ్ చేసినప్పుడు ఎటువంటి మాల్ వేర్ లేదని.. కానీ తర్వాత అహ్రాత్(‘AhRat’)అనే మాల్ వేర్ ఓ అప్ డేట్ ద్వారా దానిలో ప్రవేశించినట్లు వివరించారు. ఈ కోడ్ వినియోగదారుల డేటాను చోరీ చేస్తుందన్నారు. అలాగే స్క్రీన్ రికార్డింగ్స్, డ్యాక్యుమెంట్స్, వెబ్ పేజెస్, మీడియా ఫైల్స్ అన్నీ యాక్సెస్ చేస్తుందని వివరించారు.
ఈ నేపథ్యంలో ఐరికార్డర్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించారు. అయితే ఇప్పటికే డౌన్ లోడ్ చేసుకొని ఉన్న వినియోగదారుల డేటా మాత్రం చాలా ప్రమాదంలో పడినట్లే లెక్క. 2022 లో అయిన యాప్ అప్ డేట్ లో ఈ మాల్ వేర్ ప్రవేశించినట్లు నిపుణులు నిర్ధారించారు. ఒకవేళ ఇప్పటికీ మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే వెంటనే దానిని డిలీట్ చేయండి.
పనితీరు స్లోగా ఉంటుంది.. మీ స్మార్ట్‌ఫోన్ తరచూ లాగ్ అవుతున్నాలేదా స్లో డౌన్ అయినా లేదా ఏదైనా అప్లికేషన్‌ను ఆపరేట్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నా అది మాల్వేర్ ఇన్ఫెక్షన్‌ని సూచిస్తుంది. అటువంటి సందర్భాలలో, మీరు డౌన్‌లోడ్ చేసిన యాప్‌లను సమీక్షించడం, ఏదైనా తెలియని వాటిని వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయడం ముఖ్యం.
ఫోన్ వేడెక్కడం.. ఛార్జింగ్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లు వేడెక్కడం సాధారణమైనప్పటికీ, పనిలేకుండా లేదా అన్‌ప్లగ్ చేయబడినప్పుడు అవి వేడెక్కడం సాధారణం కాదు. మీ ఫోన్‌లో మాల్వేర్‌ను ప్రేరేపించే ఏవైనా తెలియని అప్లికేషన్‌లు లేదా అసాధారణ సెట్టింగ్‌ల కోసం తనిఖీ చేయండి.
బ్యాటరీ లైఫ్ పడిపోతుంది.. కాలక్రమేణా, పొడిగించిన ఉపయోగంతో ఫోన్ బ్యాటరీ జీవితం తగ్గుతుందని భావిస్తున్నారు. అయితే, మీ ఫోన్ బ్యాటరీ తక్కువ వ్యవధిలో ఉపయోగించిన తర్వాత కూడా వేగంగా పడిపోతే అప్రమత్తం కావాలి. మీ బ్యాటరీ వినియోగాన్ని పర్యవేక్షించండి. మీ ఫోన్‌లో ఏవైనా అనుమానాస్పద యాప్‌లు ఉన్నాయో లేదో తనిఖీ చేయండి.
ఫ్యాక్టరీ రీసెట్.. మీకు ఏవైనా అనుమానాస్పద యాప్‌లు లేదా మాల్వేర్ సంకేతాలు కనిపించకుంటే, మీ ఫోన్ వింతగా ప్రవర్తిస్తూ ఉంటే, మీ ఫోన్‌ని రీసెట్ చేయడం మంచి ఎంపిక. అయితే ఫ్యాక్టరీ రీసెట్ మొత్తం డేటా మరియు యాప్‌లను తొలగిస్తుందని గుర్తుంచుకోవాలి. కాబట్టి మీ సమాచారాన్ని ముందుగా బ్యాకప్ చేయడం మర్చిపోవద్దు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..