సాంకేతికత అనేది ప్రస్తుత కాలంలో బాగా పెరిగింది. కేవలం ఫోన్‌లు, కంప్యూటర్‌లు మాత్రమే పరిమితం కాకుండా వివిధ ఉత్పత్తులపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా గతంలో కేవలం సమయం చూసుకోవడానికి మాత్రమే ఉపయోగించే వాచ్‌లు మరింత స్మార్ట్‌గా తయారయ్యాయి. ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో అందరూ వాడే సెల్‌ఫోన్లతో అనుసంధానించుకుని వాడుకునే మార్పు చెందాయి. స్మార్ట్ వాచ్‌ల నుంచి నేరుగా సందేశాలు, కాల్‌లు, ఈ-మెయిల్‌లను పంపే అవకాశం వచ్చేసింది. అలాగే మనం ఎంత దూరం నడిచాం. ఎన్ని క్యాలరీలు బర్న్ అయ్యాయి? అలాగే మన హృదయ స్పందన రేటు వంటివి ట్రాక్ చేసుకోవచ్చు. అలాగే సాధారణంగా చాలా మంది పురుషులు కొంచెం స్టైలిష్‌గా కనిపించాలని కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి వారు వివిధ గ్యాడ్జెట్లు ధరించేందుకు ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా చేతికి స్మార్ట్ వాచ్ లేకపోతే ఏదో వెలితిగా కనిపిస్తుంది. అందువల్ల పురుషులకు సూపర్‌గా ఫిట్ అయ్యే స్మార్ట్ వాచ్‌లు ఏంటో? ఓ సారి లుక్కేద్దాం.
ఫైర్ బోల్ట్ 2022లో భారతదేశపు నంబర్ 1 స్మార్ట్‌వాచ్ బ్రాండ్. ఈ కంపెనీ రిలీజ్ చేసిన నింజా కాల్ ప్రో మీ అన్ని కార్యకలాపాలను ట్రాక్ చేయడంలో మీకు సహాయం చేస్తుంది. మీ స్మార్ట్ ఫోన్ ద్వారా బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని కాల్స్ కూడా ఎంజాయ్ చేయవచ్చు. అంతే కాల్ హిస్టరీని కూడా సులభంగా తనిఖీ చేస్తూనే డయల్ ప్యాడ్‌కి సులభంగా యాక్సెస్ చేయవచ్చు. మెరుగైన అనుభవం కోసం ఇది 240×284 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.83 అంగుళాల డిస్‌ప్లే పరిమాణాన్ని కలిగి ఉంది. అదనంగా ఈ వాచ్‌లో మిమ్మల్ని రోజంతా చురుకుగా ఉంచడానికి 100 స్పోర్ట్స్ మోడ్‌లు, ఎస్పీఓ 2 ట్రాకింగ్, హృదయ స్పందన పర్యవేక్షణ ఉన్నాయి. మీరు సంగీతం, కెమెరా, నోటిఫికేషన్ బార్‌పై సులభమైన నియంత్రణను పొందుతారు. ఈ స్మార్ట్ వాచ్ ధర రూ.1499.
ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్‌లో నాయిస్ చాలా సందడి చేస్తుంది. మీరు ఫిట్‌నెస్ ఔత్సాహికులైతే నాయిస్ కలర్ ఫిట్ స్మార్ట్ వాచ్‌లో వచ్చే 60 విభిన్న స్పోర్ట్స్ మోడ్‌లను ఎంజాయ్ చేయవచ్చు. ఎస్పీఓ2 మానిటరింగ్, హార్ట్ రేట్ ట్రాకర్, స్ట్రెస్ ట్రాకర్, బ్రీతింగ్ మోడ్‌ల వంటి ఫీచర్లు ఈ స్మార్ట్ వాచ్ ప్రత్యేకతలు. కేవలం ఒక స్వాప్‌లో ప్రతిదీ మానిటర్ చేయవచ్చు.16.9 డిస్ప్లేతో ఈ వాచ్‌లో డైలీ యాక్టివిటీ ట్రాకర్ ఉన్నాయి. రూ.1299కే లభించే ఈ స్మార్ట్ వాచ్ గొప్ప బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది.
మీకు స్మార్ట్ వాచ్ ధర విషయంలో పట్టింపు లేకపోతే యాపిల్ ఎస్ఈ స్మార్ట్ వాచ్ సూపర్ స్టైలిష్‌గా మీ చేతికి ఫిట్ అవుతుంది. ఈ వాచ్‌లో అధునాతన బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్, మూడవ తరం ఆప్టికల్ హార్ట్ సెన్సార్, ఎలక్ట్రికల్ హార్ట్ సెన్సార్ ఉన్నాయి. మీరు ఆపిల్ ఫోన్ వినియోగదారులైతే ఈ వాచ్ మీ ఫోన్‌కు కనెక్ట్ చేయడం చాలా సులభం. ఈ స్మార్ట్ వాచ్‌ను ఉపయోగించి కాల్‌లు, సందేశాలు, ఈ-మెయిల్‌లకు సులభంగా యాక్సెస్ పొందవచ్చు. రన్నింగ్, వాకింగ్, యోగా ట్రాకర్ వంటి ఫీచర్లు ఈ వాచ్‌ల ప్రత్యేకత. దీని ధర రూ.30,990గా ఉంది.
మీ వ్యాయామం, నిద్ర వంటి మీరు తీసుకునే ప్రతి చర్యను ట్రాక్ చేయాలనుకుంటున్నారా? ఈ సందర్భంలో సామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ 5 మీకు ఉత్తమ ఎంపికగా ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ ద్వారా ప్రతి అడుగు స్వయంచాలకంగా ట్రాక్ చేయవచ్చు. అలాగే రికార్డ్ చేయవచ్చు. ఇందులో 90కి పైగా వ్యాయామ మోడ్స్ ఉన్నాయి. ఈ అప్‌గ్రేడ్ చేసిన స్లీప్-ట్రాకింగ్ టెక్నాలజీతో గురకను కూడా గుర్తించవచ్చు.రూ.30,990కు అందుబాటులో ఉండే ఈ వాచ్ మీ శిక్షణ లక్ష్యాలను సెట్ చేయడం ద్వారా బీఐఏ కొలత మీ శరీర కొవ్వుతో పాటు మీ అస్థిపంజర కండరాల బరువు వరకు అన్నింటినీ ట్రాక్ చేస్తుంది. ఈ వాచ్ క్రిస్టల్ క్లియర్ డిస్‌ప్లే ఆకర్షణీయంగా ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..