Google chrome: గుగూల్ లో ఏమి సెర్చ్ చేస్తున్నారో ఎవరికీ తెలియకూడదా? అయితే ఈ సెట్టింగ్ గురించి తెలుసుకోండి.. 

|

Feb 01, 2023 | 2:45 PM

మనం ఏం సెర్చ్ చేస్తున్నామో ఇతరులకు తెలియకూడదు అనుకునే వారి కోసం గూగుల్ క్రోమ్ ఇన్ కాగ్నిటో ట్యాబ్ లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఇన్ కాగ్నిటో ట్యాబ్ ను లాక్ చేసుకొనే ఫీచర్ ను ఇప్పుడు తీసుకొచ్చింది. 

Google chrome: గుగూల్ లో ఏమి సెర్చ్ చేస్తున్నారో ఎవరికీ తెలియకూడదా? అయితే ఈ సెట్టింగ్ గురించి తెలుసుకోండి.. 
Google Chrome
Follow us on

ప్రపంచం డిజిటలైజ్ అవుతోంది. అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. ముఖ్యంగా కరోనా అనంతరం విద్యార్థుల నుంచి బిజినెస్ మేన్ ల వరకూ అంతా డిజిటల్ బాట పట్టారు. ఏది కావాలన్నా, కొనాలన్నా ఆన్ లైన్, సమాచార మార్పిడి ఆన్ లైన్, ఏదైనా తెలియని విషయాలు తెలుసుకోవాలన్నా ఆన్ లైనే. ఈ విషయంలో గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్ లు బాగా ఉపయోగపడతాయి. అయితే మనం ఏం సెర్ఛ్ చేస్తున్నామో ఇతరులకు తెలియకుండా ఉండేందుకు, మన ప్రైవసీ, భద్రతకు ఈ సెర్చ్ ఇంజిన్స్ చాలా ప్రమాణాలు పాటిస్తాయి. అనేక భద్రత ఫీచర్లు ఏటా కొత్తగా పరిచయం చేస్తాయి. వీటిపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా జనవరి 28న డేటా ప్రైవసీ డే జరుపుకొంటుంటారు. ముఖ్యంగా థర్డ్ పార్టీ యాప్ లను మన డేటా భద్రంగా ఉంచడంలో ఇవి సాయపడుతుంటాయి.

వ్యక్తిగత ప్రైవసీ భద్రం..

మనం ఏం సెర్చ్ చేస్తున్నామో ఇతరులకు తెలియకూడదు అనుకునే వారి కోసం గూగుల్ క్రోమ్ ఇన్ కాగ్నిటో ట్యాబ్ లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిని సెర్చ్ చేసే అంశాలు ఇతరులకు తెలియవు. అయితే మనం లేని సమయంలో ఫోన్, లేదా డెస్క్ టాప్ లో ఇన్ కాగ్నిటో ట్యాబ్ ఓపెన్ చేస్తే మీ డేటా ఇతరులకు కనిపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గూగుల్ క్రోమ్ సరికొత్త అప్ డేట్ ను తీసుకొచ్చింది. ఈ ఇన్ కాగ్నిటో ట్యాబ్ ను లాక్ చేసుకొనే ఫీచర్ ను ఇప్పుడు తీసుకొచ్చింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా దీనిని లాక్ చేసుకునేలా కొత్త అప్ డేట్ తీసుకొచ్చింది.

లాక్ ఎలా చేయాలంటే..

  • క్రోమ్ ని ఓపెన్ చేసి, కుడిచేతి వైపు పైన కనిపిస్తున్న మూడు గీతలపై క్లిక్ చేయాలి. దానిలో ని ఆప్షన్లలో కిందకు వెళ్తే సెట్టింగ్స్ ఉంటుంది. దానిని క్లిక్ చేసి ఆ తర్వాత ప్రైవసీ సెట్టింగ్ ను సెలెక్ట్ చేసుకోవాలి. దానిలో లాక్ ఇన్ కాగ్నిటో ట్యాబ్ అని ఆప్షన్ కనిపిస్తుంది. దానిని ఏనేబుల్ చేయాలి.
  • అప్పడు మీరు ఎప్పుడైన ఇన్ కాగ్నిటో ట్యాబ్ వినియోగించాలి అనుకున్నప్పుడు మీ ఫింగర్ ప్రింట్ / ప్యాటర్న్/ నంబర్ లాక్ ను అడిగి నిర్ధారించుకున్న తర్వాతే ఇన్ కాగ్నిటో ట్యాబ్ ఓపెన్ అవుతుంది.
  • ప్రస్తుతం ఈ అప్ డేట్ కేవలం ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో దీనికి ఐఓఎస్, పీసీ వెర్షన్లకు కూడా ప్రవేశపెట్టేందుకు గూగుల్ క్రోమ్ ప్రణాళిక చేస్తోంది.

మరింత భద్రత కోసం..

గూగుల్ క్రోమ్ మీ సెర్చింగ్ మరింత భద్రంగా ఉండాలంటే, కొన్ని ఎన్ హ్యాన్స్డ్ సెట్టింగ్స్ ను వినియోగించుకోవచ్చు. అందుకోసం గూగుల్ క్రోమ్ ను ఓపెన్ చేసి , కుడిచేతి వైపు పైన కనిపిస్తున్న మూడు గీతలపై క్లిక్ చేయాలి. దానిలో ని ఆప్షన్లలో కిందకు వెళ్తే సెట్టింగ్స్ ఉంటుంది. దానిని క్లిక్ చేసి ఆ తర్వాత ప్రైవసీ సెట్టింగ్ ను సెలెక్ట్ చేసుకోవాలి. కనిపిస్తున్న ఆప్షన్ల నుంచి సేఫ్ బ్రౌజింగ్ ను ఆన్ చేసుకోవాలి. ఇది ఒక సారి ఆన్ చేస్తే ప్రమాదకర వెబ్ సైట్లను నుంచి కాపాడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..