Lava Agni 4: ఎవరూ ఊహించని ఫీచర్లతో ఏఐ స్మార్ట్‌ఫోన్.. ఈ నెలలోనే లాంచ్

ఏఐ ఫీచర్లతో వచ్చే స్మార్ట్‌ఫోన్లకు మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. రకరకాల ఏఐ ఫీచర్లను జోడించి స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కొత్త మొబైల్స్‌ను లాంచ్ చేసేందుకు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. తాజాగా లావా కంపెనీ యువ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సరికొత్త ఫీచర్లతో ఈ నవంబర్‌లో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది.

Lava Agni 4: ఎవరూ ఊహించని ఫీచర్లతో ఏఐ స్మార్ట్‌ఫోన్.. ఈ నెలలోనే లాంచ్
Lava Agni 4

Updated on: Nov 19, 2025 | 6:12 PM

Lava Agni 4 Price: ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్(AI) వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో మొబైల్ తయారీ కంపెనీలు కూడా ఏఐపై కన్నేశాయి. ఇన్‌బిల్ట్ ఏఐ ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త ఫోన్లను తీసుకొస్తున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు వినూత్న ఏఐ ఫీచర్లతో ఫోన్లను విడుదల చేసేందుకు తయారీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇప్పుడు రిలీజ్ అయ్యే అన్నీ ఫోన్లలో దాదాపు ఏఐ టెక్నాలజీని జోడిస్తున్నాయి కంపెనీలు. దీని వల్ల స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు చాలా పనులు మరింత సులువుగా మారిపోయాయి. అలాగు ఏఐ టెక్నాలజీతో కంపెనీలు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.

తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ లావా అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో ఏఐ ఫోన్‌ను త్వరలో భారత మార్కెట్‌లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. యువ ఏఐ సిస్టమ్‌తో డిజైన్ చేసిన లావా ఆగ్ని 4 స్మార్ట్‌ఫోన్‌ను లావా అగ్ని 3 మోడల్‌కు కొనసాగింపుగా తీసుకొస్తుంది. లావా అగ్ని 3 మోడల్ ఇండియాలో బాగా విజయవంతమైంది. దీంతో దానికి అప్‌గ్రేడ్‌గా ఈ నవంబర్‌లో అగ్ని 4 మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను తెచ్చేందుకు రంగం సిద్దమైంది. నవంబర్ 20న ఈ ఫోన్ మార్కెట్‌లోకి లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.25 వేల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇందులో ఉండే ఏఐ ఫీచర్ల ద్వారా ఫోటోలను అక్కడికక్కడే ఎడిట్ చేసుకోవచ్చు. ఈ నెలలో రానున్న ఈ ఫోన్ కోసం మొబైల్ ప్రియులు ఎదురుచూస్తున్నారు.

లావా అగ్ని 4 ఫీచర్లు

-మీడియాటెక్ డైమెన్సిటీ 8350 SoC

-LPDDR5X RAM

-UFS 4.0 స్టోరేజ్‌

-50MP డ్యూయల్-కెమెరా

-66W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్

-5,000mAh లేదా 7,000mAh బ్యాటరీ

-YUVA AI టెక్నాలజీ

 

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి