Best Tablet Under 10K: రూ.10వేల లోపే బెస్ట్ ట్యాబ్లెట్లు.. టాప్ బ్రాండ్లు.. మిస్ కాకండి..

|

Jun 25, 2024 | 12:08 PM

ఒకవేళ మీరు తక్కువ ధరలో ఓ మంచి ట్యాబ్లెట్ కొనుగోలు చేయాలనుకుంటే ఈ కథనం మీకు బాగా ఉపకరిస్తుంది. రూ. 10వేల లోపు ధరలోనే పెద్ద డిస్ ప్లేతో పాటు అత్యాధునిక ఫీచర్లు కలిగిన ట్యాబ్లెట్లు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో టాప్ బ్రాండ్లు అయిన లెనోవో, శామ్సంగ్, హానర్, రియల్ మీ, యాసర్ వంటి బ్రాండ్లు ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం రండి..

Best Tablet Under 10K: రూ.10వేల లోపే బెస్ట్ ట్యాబ్లెట్లు.. టాప్ బ్రాండ్లు.. మిస్ కాకండి..
Samsung Galaxy Tab A10.1
Follow us on

టెక్ గ్యాడ్జెట్ల వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్లు, ఇయర్ బడ్స్, ల్యాప్ టాప్స్, స్పీకర్స్ ఇలా అనేక రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను జనాలు విరవిగా వినియోగిస్తున్నారు. ఇటీవల కాలంలో ట్యాబ్లెట్ల వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. ఈ ట్యాబ్లెట్లు స్మార్ట్ ఫోన్ కన్నా పెద్ద సైజులో ఉండటంతో పాటు ఎక్కడికైనా సులభంగా క్యారీ చేసే అవకాశం ఉండటం, పర్సనల్ కంప్యూటర్ తరహాలో సైతం వినియోగించే వీలు ఉండటంతో వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే ఈ ట్యాబ్లెట్లలో కూడా రకాల బ్రాండ్లు, విభిన్న ఫీచర్లు, తక్కువ నుంచి ఎక్కువ ధరలకు అందుబాటులో ఉంటున్నాయి. ఒకవేళ మీరు తక్కువ ధరలో ఓ మంచి ట్యాబ్లెట్ కొనుగోలు చేయాలనుకుంటే ఈ కథనం మీకు బాగా ఉపకరిస్తుంది. రూ. 10వేల లోపు ధరలోనే పెద్ద డిస్ ప్లేతో పాటు అత్యాధునిక ఫీచర్లు కలిగిన ట్యాబ్లెట్లు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో టాప్ బ్రాండ్లు అయిన లెనోవో, శామ్సంగ్, హానర్, రియల్ మీ, యాసర్ వంటి బ్రాండ్లు ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం రండి..

లెనోవో కాలింగ్ ట్యాబ్ ఎం8..

ఈ ట్యాబ్లెట్లో 8 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ వస్తుంది. వెనుకవైపు 8ఎంపీ కెమెరా, ముందు వైపు 2ఎంపీ కెమెరా ఉంటుంది. మెటాలిక్ బాడీ డిజైన్ లో మంచి లుక్ ఉంటుంది. మీడియా టెక్ హీలియో ఏ22 ట్యాబ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ సాయంతో అధిక పనితీరుకు భరోసా ఇస్తుంది. దీని ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్లో కేవలం రూ. 5849గా ఉంది.

శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ 10.1..

ఈ శామ్సంగ్ ట్యాబ్లెట్లో 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఉంటుంది. 2జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. 6150 బ్యాటరీ, వెనుకవైపు 8ఎంపీ కెమెరా, ముందు వైపు 5ఎంపీ కెమెరాలను కలిగి ఉంటుంది. దీని పనితీరు, వీడియో, ఆడియో నాణ్యత అద్భుతంగా ఉంటుంది. దీని ధర అమెజాన్లో ప్లాట్ ఫారంలో రూ. 8,921గా ఉంటుంది.

హానర్ ప్యాడ్ ఎక్స్8..

మార్కెట్లో రూ. 10వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ ట్యాబ్లెట్లలో ఇదీ ఒకటి. దీనిలో 10.1 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే ఉంటుంది. 3జీబీ ర్యామ్, 32 జీబీ ర్యామ్, 5100ఎంఏహెచ్ బ్యాటరీ, 5ఎంపీ కెమెరా ఉంటుంది. దీని ధర అమెజాన్లో రూ. 8,999గా ఉంది.

లెనోవో ట్యాబ్ ఎం10..

ఇది హెచ్ డీ ట్యాబ్లెట్. దీనిలో 10.1 అంగుళా హెచ్డీ డిస్ ప్లేను కలిగి ఉంటుంది. ర్యామ్ 3జీబీ, ఇంటర్నల్ స్టోరేజ్ 32 జీబీ ఉంటుంది. బ్యాటరీ 4850ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. వెనుక వైపు కెమెరా 5ఎంపీ, ముందు వైపు 2ఎంపీ ఉంటుంది.
దీని ధర అమెజాన్లో రూ. 7450గా ఉంది.

రియల్ మీ ప్యాడ్ మినీ వైఫై ట్యాబ్లెట్..

తక్కువ ధరలో క్వాలిటీ గ్యాడ్జెట్లు అందించే కంపెనీలో రియల్ మీ కూడా ఒకటి. ఇది 8.7 అంగుళాల డిస్ ప్లే ను కలిగి ఉంటుంది. 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. 6400ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. కెమెరా 8ఎంపీ వెనుకవైపు ఉంటుంది. దీని ధర అమెజాన్లో రూ. 9,999గా ఉంది.

యాసర్ వన్ టీ4-82ఎల్..

దీనిలో 8 అంగుళాల ఐపీఎస్ ప్యానల్ మల్టీ టచ్ డిస్ ప్లే ఉంటుంది. 2.0జీహెర్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ తో రన్ అవుతుంది. 3జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. బ్యాటరీ 5000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ముందు వైపు 8ఎంపీ, వెనుక వైపు 2ఎంపీ కెమెరాతో వస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..