మంచి ల్యాప్ టాప్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అది కూడా తక్కువ ధరలో బెస్ట్ స్పెసిఫికేషన్లు, టాప్ ఫీచర్లు ఉన్న ల్యాప్ టాప్ కావాలని కోరుకుంటున్నారా? ఈ కథనం మీ కోసమే. దీనిలో అనువైన ధరలో మంచి ల్యాప్ టాప్ లను మీకు అందిస్తున్నాం. జాబితాలో ఎంఎస్ఐ, లెనోవో, ఏసర్ వంటి టాప్ బ్రాండ్లు ఉన్నాయి. విద్యా అవసరాలు, వ్యాపార అవసరాలకు ఇవి సరిగ్గా సరిపోతాయి. బేసిక్ ఫీచర్లు ఇందులో ఉంటాయి. మీకిష్టమైన కార్యక్రమాలు చూడటం, వెబ్ బ్రౌజ్ చేయడం, సోషల్ మీడియాలో కనెక్ట్ అవడం వంటివి ఉంటాయి. అలాగే అధిక స్టోరేజ్ సామర్థ్యం ఉండటంతో ముఖ్యమైన ఫైల్స్, డేటాను భద్రంగా కాపాడుకోవచ్చు. అనువైన బడ్జెట్లో లభ్యమయ్యే బెస్ట్ ల్యాప్ టాప్ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
హై ఎండ్ ల్యాప్ టాప్ లకు పెట్టింది పేరైనా ఎంఎస్ఐ నుంచి అనువైన బడ్జెట్లో వస్తున్న బెస్ట్ ల్యాప్ టాప్ ఇది. ఇది 8జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో వస్తుంది. దీనిలో 11వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3-1115జీ4 ప్రాసెసర్, ఇంటెల్ యూహెచ్డీ గ్రాఫిక్స్ ఉంటుంది. వీటి ద్వారా అధిక వేగంతో పాటు అధిక నాణ్యత కలిగిన విజువల్స్ అందివ్వడంతో పాటు మొత్తం పనితీరును సౌకర్యవంతంగా మార్చుతుంది. దీనిలో 180 డిగ్రీల లే ఫ్లాట్ అండ్ ఫ్లిప్ ఎన్ షేర్ ఫంక్షన్ ఉంటుంది. దీని సాయంతో సులభంగా స్క్రీన్ షేర్ చేసుకోవచ్చు. దీనిని అమెజాన్ ప్లాట్ ఫారంలో దీనిని రూ. 34,490కి కొనుగోలు చేయొచ్చు.
అనువైన బడ్జెట్లో అందుబాటులో ఉన్న మరో ల్యాప్ టాప్ ఇది. దీనిలో 11.60అంగుళాల హెచ్ డీ యాంటీ గ్లేర్ 60హెర్జ్ స్క్రీన్ ఉంటుంది. దీని బరువు 990గ్రాములు మాత్రమే ఉంటుంది. ఈ జియో బుక్ లో ఆక్టా కోర్ మీడియా టెక్ ఎంటీ8788 సీపీయూ తో మంచి పనితీరును అందిస్తుంది. దీనిలో 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, అదనపు ఎస్డీ కార్డుతో 256జీబీ వరకూ పెంచుకోవచ్చు. ఇది జియో ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. 4000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 2ఎంపీ ఫ్రంట్ కెమెరా వీడియోకాల్స్ అందిస్తుంది. దీని ధర అమెజాన్లో రూ. 14,701గా ఉంది.
ఈ ల్యాప్ టాప్ 11వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3-1115జీ4 ప్రాసెసర్ 4.1జీహెర్జ్ క్లాక్ స్పీడ్ తో వస్తుంది. ఇది మల్టీ టాస్కింగ్ కు బాగా సరిపోతుంది. మొత్తం పనితీరును మెరుగుపురస్తుంది. విండోస్ 10 హోమ్ ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. 15.60అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. 8జీబీ ర్యామ్, 512జీబీ మెమరీ ఉంటుంది. అధిక బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. 10 గంటల పనిసమయాన్ని అందిస్తుంది. యాంటీ గ్లేర్ స్క్రీన్ కంటిని ఇబ్బంది లేకుండా చూస్తుంది. దీనిని అమెజాన్ ప్లాట్ ఫారంలో రూ. 43,990కి కొనుగోలు చేయొచ్చు.
ఈ ల్యాప్ టాప్ విండోస్ 11 ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. ఏఎండీ రైజెన్ 3 7320యూ ప్రాసెసర్, ఏఎండీ రేడియన్ గ్రాఫిక్స్ అధిక పనితీరుతో పాటు మంచి విజువల్ అనుభూతిని అందిస్తుంది. ఈ ల్యాప్ టాప్ 15.6 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లే ఉంటుంది. యాంటీ గ్లేర్ స్క్రీన్ మీ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది. దీని ధర అమెజాన్లో రూ. 36,990గా ఉంది.
ఇది శక్తివంతమైన మోడల్. ఇది 14 అంగుళాల డిస్ ప్లే హెచ్ డచ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది అన్ని రకాల ఆండ్రాయిడ్ యాప్స్ కు సపోర్టు చేస్తుంది. డాక్యుమెంట్లు, ప్రజెంటేషన్స్ చేసుకోవడానికి బాగా ఉపకరిస్తుంది. బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్ యాడ్స్ సౌకర్యం ఉంటుంది. 12 గంటల బ్యాటరీ జీవితం అందిస్తుంది. దీనిలో 4జీబీ ర్యామ్, 64జీబీ మెమరీతో వస్తుంది. దీని ధర అమెజాన్లో రూ. 28,389గా ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..