Smart watch: మణికట్టుపై గూగుల్ మ్యాప్.. కొత్త ఫీచర్‌తో బోట్ స్మార్ట్ వాచ్ లాంచ్..

దేశంలోని ప్రముఖ బ్రాండ్ అయిన బోట్ తన సరికొత్త స్మార్ట్ వాచ్ ను మార్కెట్ లోకి ఆవిష్కరించింది. దీనిద్వారా నూతన ఫీచర్ ను వినియోగదారులకు పరిచయం చేసింది. స్టోమ్ కాల్ 3గా పిలవబడే ఈ స్మార్ట్ వాచ్ లో అంతర్నిర్మిత నావిగేషన్‌ సిస్టమ్ ఏర్పాటు చేసింది. ఫ్లిప్ కార్ట్, కంపెనీ అధికార వెబ్ సైట్ లలో కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ.1099.

Smart watch: మణికట్టుపై గూగుల్ మ్యాప్.. కొత్త ఫీచర్‌తో బోట్ స్మార్ట్ వాచ్ లాంచ్..
Boat Storm Call3 Watch
Follow us

|

Updated on: Apr 23, 2024 | 3:47 PM

స్మార్ట్ వాచ్ లు రోజుకొక కొత్త ఫీచర్ తో మార్కెట్ లోకి విడుదవుతున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా లేటెస్ట్ టెక్నాలజీతో ఆకట్టుకుంటున్నాయి. స్మార్ట్ ఫోన్ ను తీయాల్సిన పని లేకుండానే వీటి ద్వారా పనులు పూర్తి చేసుకోవచ్చు. అలాగే హార్ట్ బీట్ తదితర వాటిని తెలుసుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు తాజాగా మరో కొత్త ఫీచర్ తో స్మార్ట్ వాచ్ అందుబాటులోకి వచ్చింది. దానిలోని టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ కారణంగా కొత్త ప్రాంతంలో ఏ మాత్రం ఇబ్బంది లేకుండా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఆ వాచ్ పేరేంటి? దానిలోని ఫీచర్లు ఏంటి? దాని ధర ఎంత? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

స్టోర్మ్ కాల్ 3 స్మార్ట్ వాచ్..

దేశంలోని ప్రముఖ బ్రాండ్ అయిన బోట్ తన సరికొత్త స్మార్ట్ వాచ్ ను మార్కెట్ లోకి ఆవిష్కరించింది. దీనిద్వారా నూతన ఫీచర్ ను వినియోగదారులకు పరిచయం చేసింది. స్టోమ్ కాల్ 3గా పిలవబడే ఈ స్మార్ట్ వాచ్ లో అంతర్నిర్మిత నావిగేషన్‌ సిస్టమ్ ఏర్పాటు చేసింది. ఫ్లిప్ కార్ట్, కంపెనీ అధికార వెబ్ సైట్ లలో కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ.1099. సామాన్యులకు కూడా అందుబాటు ధరలో లభిస్తుంది.

టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్..

స్టోమ్ కాల్ 3 స్మార్ట్ వాచ్ లో Mappls MapmyIndia ద్వారా ఆధారితమైన అంతర్నిర్మిత స్వతంత్ర టర్న్-బై-టర్న్ నావిగేషన్ సిస్థమ్ ఉంది. దీనిద్వారా కచ్చితమైన దిశలను తెలుసుకోవచ్చు. ప్రయాణ సమయంలో నావిగేషన్ సిస్టమ్ చాలా ఉపయోగపడుతుంది. దేశంలోని విభిన్న నగరాలు, గ్రామాలలో డోర్‌స్టెప్ స్థాయి మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. నావిగేషన్ కోసం స్మార్ట్ ఫోన్ ను చూడాల్సిన పనిలేదు. చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ ను అనుసరించి చాలా సులభంగా, ఎలాంటి టెన్షన్ లేకుండా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. నావిగేషన్ తో పాటు ఈ వాచ్ లో మరో ప్రత్యేక ఫీచర్ ఉంది. అదే క్యూఆర్ ట్రే ఫీచర్‌. వినియోగదారులు తమ వాచ్‌లో నేరుగా క్యూ ఆర్ కోడ్ లను సేవ్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.

స్టోమ్ కాల్ 3 ప్రత్యేకతలు..

  • 1.83 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే
  • 550 నిట్స్ బ్రైట్‌నెస్, 2.5డి కర్వ్డ్ డిజైన్
  • బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ, మైక్రోఫోన్,స్పీకర్‌తో కాలింగ్ చేసుకునే అవకాశం
  • వందకన్నా ఎక్కువ క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేస్‌లు
  • నీరు, చెమట, ధూళి లోపలకు ప్రవేశించకుండా పటిష్ట వ్యవస్థ
  • హార్ట్ బీట్, నిద్ర పర్యవేక్షణ
  • వివిధ వ్యాయామాల కోసం 700+ యాక్టివిటీ ట్రాకింగ్ మోడ్‌లు
  • 7 రోజుల బ్యాటరీ లైఫ్
  • వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, స్మార్ట్ నోటిఫికేషన్లు
  • హిందీ, ఇంగ్లీష్ లలో ఎంపిక చేసుకునే అవకాశం

ఆకర్షణీయమైన రంగులు..

బోట్ స్టోర్మ్ కాల్ 3 స్మార్ట్ వాచ్ నాలుగు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. చెర్రీ బ్లోసమ్, యాక్టివ్ బ్లాక్, సిల్వర్ మెటల్, ఆలివ్ గ్రీన్ రంగులలో స్టైలిష్ గా కనిపిస్తుంది. ఈ వాచ్ రూ. 1,099కు అందుబాటులో ఉంది. ఫిట్‌నెస్, టెక్ ఔత్సాహికులకు చాలా ఉపయోగపడుతుంది. నావిగేషన్ సిస్టమ్ కారణంగా ఈ వాచ్ కు ప్రజల ఆదరణ పెరుగుతుందని భావిస్తున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?