Tech Tips: మీ ఫోన్‌లో ఈ యాప్స్‌ వేస్తే RAM పెరుగుతుందా? ఇది నిజమేనా?

Tech Tips: కొన్నిసార్లు ఈ యాప్స్ బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతాయి. దీనివల్ల ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుంది. పనితీరు తగ్గుతుంది. అంటే దీర్ఘకాలంలో ఈ యాప్స్ ఫోన్ వేగాన్ని పెంచే బదులు నెమ్మదిస్తాయి. ఇప్పుడు చాలా మొబైల్ కంపెనీలు వర్చువల్..

Tech Tips: మీ ఫోన్‌లో ఈ యాప్స్‌ వేస్తే RAM పెరుగుతుందా? ఇది నిజమేనా?

Updated on: Aug 23, 2025 | 10:29 AM

Tech Tips: ఇటీవలి కాలంలో సోషల్ మీడియా, ఇంటర్నెట్‌లో మీరు చాలా వీడియోలు, యాప్‌లను చూసి ఉండవచ్చు. అవి వాటిని ఉపయోగించడం వల్ల మీ ఫోన్ మునుపటి కంటే వేగంగా ఉంటుందని, దాని RAM పెరుగుతుందని చెబుతాయి. చాలామంది అలాంటి యాప్‌లను ఉపయోగిస్తున్నారు. కానీ, అలాంటి యాప్‌లు నిజంగా మీ ఫోన్ RAMని పెంచుతాయేమో చూద్దాం.

ఇది కూడా చదవండి: Viral Video: నాతో పెట్టుకుంటే అంతే సంగతి.. పులిపై కుక్క ఎదురుదాడి.. 300 మీటర్లు లాకెళ్లిన శునకం.. వీడియో వైరల్‌

గూగుల్ ప్లే స్టోర్‌లో ఇలాంటి యాప్‌లు చాలా ఉన్నాయి. వాటి పేర్లు, వివరణలు ఫోన్ ర్యామ్‌ని నిజంగా పెంచుతాయని వినియోగదారులను నమ్మిస్తాయి. కానీ వాస్తవం భిన్నంగా ఉంటుంది. సాంకేతిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. RAM అనేది కంపెనీ ద్వారా ఫోన్‌లో మాత్రమే ఇన్‌స్టాల్ చేసిన హార్డ్‌వేర్ భాగం. అలాగే దానిని ఏ యాప్ ద్వారా అయినా పెంచడం పూర్తిగా అసాధ్యం. అంటే ఈ యాప్‌ల సహాయంతో మీ మొబైల్ భౌతిక ర్యామ్‌ పెరగదు. కానీ అది తాత్కాలిక ప్రభావాన్ని మాత్రమే సృష్టిస్తుంది.

ఇది కూడా చదవండి: ఐదేళ్ల కిందట బ్యాన్‌ అయిన టిక్‌టాక్‌ భారత్‌లోకి మళ్లీ వస్తుందా?

ఈ ర్యామ్‌ బూస్టర్ లేదా క్లీనర్ యాప్‌లు ఫోన్ RAMని పెంచవు. అవి బ్యాక్‌రౌండ్‌లో నడుస్తున్న యాప్‌లను మూసివేస్తాయి. కొన్ని కాష్ ఫైల్‌లను క్లియర్ చేస్తాయి. ఇలా చేయడం ద్వారా RAMలో కొంత స్థలం ఖాళీ అవుతుంది. అందుకే ఫోన్ కొంతకాలం వేగంగా ఉండవచ్చు. కానీ మీరు ఫోన్‌ను మళ్లీ ఉపయోగించడం ప్రారంభించిన వెంటనే అది మళ్లీ నెమ్మదించవచ్చు.

బ్యాటరీ లైఫ్ పై ప్రభావం:

కొన్నిసార్లు ఈ యాప్స్ బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతాయి. దీనివల్ల ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుంది. పనితీరు తగ్గుతుంది. అంటే దీర్ఘకాలంలో ఈ యాప్స్ ఫోన్ వేగాన్ని పెంచే బదులు నెమ్మదిస్తాయి. ఇప్పుడు చాలా మొబైల్ కంపెనీలు వర్చువల్ ర్యామ్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఇందులో ఫోన్ అంతర్గత నిల్వలో కొంత భాగాన్ని RAMగా ఉపయోగిస్తారు. ఉదాహరణకు మీ ఫోన్‌లో 6GB RAM ఉందని, కంపెనీ 4GB వర్చువల్ ర్యామ్ ఎంపికను ఇచ్చిందని అనుకుందాం.. అప్పుడు ఫోన్ కొన్ని సందర్భాల్లో 10GB RAM లాగా పనిచేయగలదు. కానీ ఇది నిజమైన ర్యామ్‌ కాదు. ఇది కొంతకాలం మాత్రమే పనితీరును మెరుగుపరుస్తుంది. కానీ ఫోన్‌కు దాని స్వంత ర్యామ్‌ ఉన్నప్పుడే నిజమైన వేగం అందుబాటులో ఉంటుంది. అందుకే కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు RAM పై శ్రద్ధ వహించండి.

ఇది కూడా చదవండి: Washing Powder Nirma: ఒకప్పుడు దేశాన్ని ఏలిన ‘నిర్మా’ ఇప్పుడు ఏమైపోయింది..? ఒక తప్పు వల్ల కనుమరుగు

ప్రైవసీ ముప్పు:

ఏ థర్డ్‌ పార్టీ యాప్ కూడా మీ ఫోన్ RAMని పెంచవు. దాని దీర్ఘకాలిక పనితీరును మెరుగుపరచదు. బదులుగా అటువంటి యాప్‌లు మీ ప్రైవసీకి ముప్పుగా మారవచ్చు. ఎందుకంటే అవి అవసరమైన దానికంటే ఎక్కువ అనుమతులు తీసుకోవడం ద్వారా మీ డేటాను దొంగిలించవచ్చు. మీరు నిజంగా మీ ఫోన్‌ను వేగవంతం చేయాలనుకుంటే కంపెనీ వర్చువల్ ర్యామ్‌ ఫీచర్‌ను ఉపయోగించండి. లేదా ఎక్కువ ర్యామ్‌ ఉన్న కొత్త ఫోన్‌ను కొనండి. ర్యామ్‌ను యాప్ ద్వారా కాకుండా హార్డ్‌వేర్ ద్వారా మాత్రమే పెంచవచ్చు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి