SpaceX Launch Schedule : అంతరిక్ష యాత్రకు రంగం రెడీ అవుతోంది స్పేస్‌ఎక్స్. డ్రాగన్ క్రూ క్యాప్సుల్ ద్వారా ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షంలోకి పంపేందుకు ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది స్పేస్ఎక్స్. తొలి ప్రైవేటు అంతరిక్ష యాత్రగా భావిస్తున్న ఈ మిషన్‌ను 2021 చివరలో నలుగురు వ్యక్తులను కక్ష్యలోకి పంపనున్నట్లు తెలిపింది. ‘షిఫ్ట్4 పేమేంట్స్’ సంస్థ సీఈఓ స్పేస్‌క్రాఫ్ట్‌కు నాయకత్వం వహిస్తారని తెలిపింది.
ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షంలోకి పంపేందుకు చేపట్టిన మిషన్‌కు ప్రణాళికలు ఇప్పటి దాదాపు పూర్తయిందని ప్రకటించింది స్పేస్ఎక్స్. మరో ముగ్గురి పేర్లను కూడా త్వరలోనే ఈయన ఖరారు చేస్తారని వెల్లడించింది. త్వరలోనే వారి వివరాలను ప్రకటిస్తామని పేర్కొంది.
జేర్డ్ ఐసాక్‌మన్ డ్రాగన్ వ్యోమనౌకలోని మూడు సీట్లను సాధారణ ప్రజలకు కేటాయిస్తారు. ఇన్స్పిరేషన్4 సిబ్బంది డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌తో పాటు ఫాల్కన్ 9 వ్యోమనౌకలో వాణిజ్య శిక్షణను పొందుతారు. ఆర్బిటాల్ మెకానిక్స్, జీరో గ్రావిటీని తట్టుకోవడం సహా ఇతర అంశాలపై వారికి శిక్షణ ఇస్తున్నారు. అత్యవసర పరిస్థితితుల్లో ఎలా స్పందించాలి.. స్పేస్‌సూట్-స్పేస్‌క్రాఫ్ట్ ప్రవేశం, పూర్తిస్థాయి సిమ్యులేషన్పై శిక్షణ అందిస్తున్నారు.
మిషన్ పూర్తయిన తర్వాత డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్.. భూవాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఫ్లోరిడాలోని తీరంలో నీటిపై సురక్షితంగా ల్యాండ్ అవుతుంది. ‘షిఫ్ట్4 పేమేంట్స్’ సంస్థకు ఇప్పటికే చాలా మంది అప్లై చేసుకున్నారు. వారిలో మొదటగా ఈ నలుగురిని మాత్రమే సంస్థ ఎంపిక చేసింది. వారితోపాటు మరో ముగ్గురుకూడా ఉన్నట్లుగా సంస్థ ఇప్పటికే ప్రకటించింది. కానీ వారి వివరాలను ప్రకటించాలేదు. మొత్తం 8 మందితో అంతరిక్ష యాత్ర సాగనుంది. మిషన్ ఎప్పుడు లాంచ్ తేదీలను మాత్రం త్వరలో ప్రకటిస్తామని ఆ సంస్థ సీఈఓ తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్‌జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్..
Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..