
సమ్మర్ కావడంతో ఎండ వేడిని తట్టుకునేందుకు ఇళ్లల్లో ఏసీ వినియోగం అనేది బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు ఠాకెత్తిస్తున్నాయి. దీంతో ఏసీ సేల్స్ కూడా పెరుగుతున్నాయి. ఏసీని ఎలా వాడాలనేది చాలామందికి తెలియదు. దీంతో ఎయిర్ కండీషనర్ గురించి పట్టించుకోవడమే మానేస్తారు. అలా వదిలిస్తే ఏసీ త్వరగా పాడయ్యే అవకాశముంటుంది. కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఏసీ ఎక్కువకాలం పనిచేస్తుంది. కొన్ని చిన్న టిప్స్ పాటిస్తే ఏసీ ఎక్కువ రోజులు పనిచేస్తుంది. అవేంటో చూద్దాం.
ఏసీని సర్వీసింగ్ చేయించుకుంటూ ఉండాలి. ఏసీ ఫిల్టర్లలో దుమ్ము, బ్యాక్టీరియా వంటివి పేరుకుపోతూ ఉంటాయి. దీంతో ఫిల్టర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. దీని వల్ల ఏసీ నుంచి వచ్చే గాలి శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. వేసవికాలంలో ఏసీ వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎండాకాలం వచ్చే ముందు ఏసీని సర్వీసింగ్ చేయించుకోవాలి. ఏడాదికి మూడు లేదా నాలుగుసార్లు ఏసీ సర్వీసింగ్ చేయించుకోవాలి. దీని వల్ల ఏసీ మెరుగ్గా పనిచేయడమే కాకుండా దాని సామర్థ్యం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఎలాంటి సమస్యలు లేకుండా ఏసీ పనిచేస్తుంది.
మీరు నివసించే ప్రాంతాన్ని బట్టి ఏసీ సర్వీసింగ్ ఏడాదికి ఎన్నిసార్లు చేయించుకోవాలనేది నిర్ణయించుకోండి. మెట్రో సిటీలు, పారిశ్రామిక ప్రాంతంలో నివసిస్తుంటే ప్రతీ మూడు నుంచి 4 నాలుగు నెలలకు సర్వీసింగ్ చేయించుకోండి. ఇక అవుట్ డోర్ యూనిట్‌లో కూడా దమ్ము, ధూళి అనేవి పేరుకుపోతూ ఉంటాయి. దీంతో అవుట్ డోర్ యూనిట్‌కు కూడా తరచుగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దీంతో ఏసీ బాగా పనిచేస్తుంది. ఇక నెలకు ఒకసారి ఫిల్టర్లను క్లీన్ చేసుకోవాలి. అలాగే కూలింగ్ గ్యాస్ లెవల్స్ సరిగ్గా ఉన్నాయా.. లేవా అనేది చూసుకోండి. ఇక ఏసీ కాయిల్స్, ఫిన్‌లను క్లిక్ చేసుకోండి. ఇక డ్రైనేజీ పైపును చూసుకోండి. పైపు మూసుకుపోతే ఏసీ నుంచి వాటర్ లీక్ అవుతుంది. అందుకే పైప్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ చిన్న టిప్స్ పాటించడం వల్ల మీ ఏసీ మెరుగ్గా చేయడమే కాకుండా కరెంట్ బిల్లు కూడా ఆదా అవుతంది.