ఎస్బీఐ ఏటీఎం వినియోగదారులకు అలర్ట్‌

ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్‌. ఇకపై ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేసేటప్పుడు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి.

ఎస్బీఐ ఏటీఎం వినియోగదారులకు అలర్ట్‌

Edited By:

Updated on: Aug 18, 2020 | 11:32 AM

SBI ATM Transaction: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్‌. ఇకపై ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేసేటప్పుడు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఏటీఎంలో ట్రాన్సాక్షన్‌ ఫెయిల్‌ అయితే ఇకపై ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అవును మీరు చదువుతున్నది నిజమే.. ఫెయిల్డ్ ఏటీఎం ట్రాన్సాక్షన్ పేరుతో ఎస్‌బీఐ ఖాతాదారుల నుంచి ఛార్జీలను వసూలు చేయనుంది.  సాధారణంగా అకౌంట్‌లో సరిపడా డబ్బులు లేనప్పుడు ట్రానాక్షన్‌ ఫెయిల్‌ అవుతూ ఉంటుంది. అప్పుడు రూ.20+జీఎస్టీ చొప్పున ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని తప్పించుకోవడం కోసం డబ్బులు డ్రా చేసే ముందు బ్యాలెన్స్ చెక్ చేసుకొని ఏటీఎంకు వెళ్లడం మంచిది. కాగా మరోవైపు ఎస్బీఐ ఏటీఎం వినియోగదారులకు నెలకు 8 సార్లు(5 ఎస్బీఐ, 3 ఇతర ఏటీఎంలు) మాత్రమే ఉచిత లావాదేవీలకు అవకాశం ఉంటుంది. నాన్‌ మెట్రోలో అయితే 10 ఏటీఎం లావాదేవీలు(5 ఎస్బీఐ, 5 ఇతర ఏటీఎంలు) ఉచితం. అయితే సేవింగ్స్ అకౌంట్‌లో రూ.1,00,000 కన్నా ఎక్కువ యావరేజ్ బ్యాలెన్స్ ఉన్నఖాతాదారులు ఎస్‌బీఐ గ్రూప్ ఏటీఎంలల్లో ఎన్నిసార్లైనా డబ్బులు డ్రా చేసుకోవచ్చు.

Read More:

Eesha Rebba: ఈషా రెబ్బా ట్విట్టర్‌ అకౌంట్ హ్యాక్‌!

రాముడిగా ప్రభాస్‌.. మరి ఆ నలుగురు ఎవరు..!