Galaxy M35: సామ్‌సంగ్‌ నుంచి మరో బడ్జెట్‌ ఫోన్‌.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే

సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌35 స్మార్ట్ ఫోన్‌కు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ ఆన్‌లైన్‌లో కొన్ని ఫీచర్లు లీక్‌ అవుతున్నాయి. వీటి ప్రకారం.. ఈ స్మార్ట్ ఫోన్‌లో బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్‌తో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో 25 వాట్స్‌ సపోర్ట్‌ చేసే బ్యాటరీని ఇవ్వనున్నారని సమాచారం. ఇక ధర విషయానికొస్తే..

Galaxy M35: సామ్‌సంగ్‌ నుంచి మరో బడ్జెట్‌ ఫోన్‌.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే
Galaxy M35
Follow us

|

Updated on: Apr 21, 2024 | 12:17 PM

సౌత్‌ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ ఇటీవల వరుసగా స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తుంది. ఓవైపు ప్రీమియం మార్కెట్‌తో పాటు బడ్జెట్‌ మార్కెట్‌ను కూడా టార్గెట్‌ చేసుకొని ఫోన్‌లను విడుదల చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ మిడ్ రేంజ్‌ బడ్జెట్‌ ఫోన్‌ను తీసుకొస్తోంది సామ్‌సంగ్‌. గ్యాలక్సీ ఎమ్‌ 35 పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. త్వరలోనే భారత మార్కెట్లోకి వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్లు.? ధర వివరాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌35 స్మార్ట్ ఫోన్‌కు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ ఆన్‌లైన్‌లో కొన్ని ఫీచర్లు లీక్‌ అవుతున్నాయి. వీటి ప్రకారం.. ఈ స్మార్ట్ ఫోన్‌లో బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్‌తో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో 25 వాట్స్‌ సపోర్ట్‌ చేసే బ్యాటరీని ఇవ్వనున్నారని సమాచారం. ఇక ధర విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేకపోయినప్పటికీ మిడ్‌ రేంజ్‌లో (సుమారు రూ. 20,00) ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఇక నెట్టింట వైరల్‌ అవుతోన్న సమాచారం ఆధారంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.6 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఇన్ఫినిటీ-వీ డిస్‌ప్లేను అందించనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్‌లో శక్తివంతమైన ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఇవ్వనున్నారు. ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో ట్రిపుల్ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించనున్నారు. వీటిలో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమర్‌ కెమెరా, 5MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ కెమెరాను ఇవ్వనున్నారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 5 మెగపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు.

ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 15 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు. 128GB స్టోరేజ్‌ను అందించనున్నారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్-C కనెక్టివిటీ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లను అందించారు. ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
మాస శివరాత్రి రోజున ఏర్పడిన శుభయోగాలు.. శివయ్యను ఇలా పూజించండి
మాస శివరాత్రి రోజున ఏర్పడిన శుభయోగాలు.. శివయ్యను ఇలా పూజించండి
ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్
ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్
స్వ్కాడ్‌లో ఛాన్స్..కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల్లో 2 డకౌట్లు
స్వ్కాడ్‌లో ఛాన్స్..కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల్లో 2 డకౌట్లు
తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ మరో రెండు రోజుల పాటు వర్షాలు 
తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ మరో రెండు రోజుల పాటు వర్షాలు 
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా