Bank Account Safety: పెరుగుతున్న సైబర్ మోసాల దృష్ట్యా, బ్యాంకులు తమ కస్టమర్లకు ప్రతిరోజూ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటాయి. బ్యాంకులు, ఐటీ కంపెనీలు కూడా దాని భద్రతను పెంచడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ సైబర్ నెరగళ్లు ఎదో ఒక విధంగా బ్యాంక్ ఎకౌంట్లను హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. మన ఎకౌంట్లు నేరగాళ్ల బారిన పడకుండా చూసేందుకు బ్యాంకులు ఎంత ప్రయత్నిస్తాయో.. అంతకంటే ఎక్కువగా మనమో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేసే ఒక చిన్న తప్పు హ్యాకర్లు మన ఎకౌంట్ లోకి జెట్ వేగంతో దూసుకువచ్చే తలుపును తెరుస్తుంది. అదేకానీ జరిగితే అప్పుడు మనకు విచారం తప్ప ఏమీ మిగలదు.
అయితే, మనవైపు నుంచి మనం ఎకౌంట్ కాపాడుకోవడానికి మన చేతిలో ఉండే ఆయుధం పాస్‌వర్డ్ ఒక్కటే. దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాంక్ పాస్‌వర్డ్ బలహీనంగా ఉంటే బ్యాంక్ ఖాతా మొత్తం భద్రతా వ్యవస్థను నాశనం అయిపోతుంది. మాల్వేర్ ద్వారా హ్యాకర్లు మన బ్యాంక్ పాస్‌వర్డ్‌ను హ్యాకర్లు దొంగిలించే అవకాశాలుంటాయి. మన పాస్‌వర్డ్ ని సురక్షితంగా ఎలా ఉంచుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మన మొబైల్, టాబ్లెట్, కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లో యాంటీవైరస్‌ను ఖచ్చితంగా ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. బ్యాంక్ పాస్‌వర్డ్‌ను సురక్షితంగా ఉంచడానికి కొన్ని ప్రత్యేక విషయాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా సరే, తమ పాస్‌వర్డ్‌ని మళ్లీ ఉపయోగించకూడదు. పాస్‌వర్డ్ మేనేజర్‌ని ఉపయోగించడం చాలా సురక్షితంగా ఉంటుంది. వాస్తవానికి, పాస్‌వర్డ్ మేనేజర్ మీ ప్రతి ఖాతాకు విభిన్న, సంబంధం లేని పాస్‌వర్డ్ లను జనరేట్ చేస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఏదైనా పాస్‌వర్డ్‌ని ట్యాంపర్ చేసినప్పటికీ, మిగిలిన ఖాతా సురక్షితంగా ఉంటుంది.
అదేవిధంగా యూజర్ టూ స్టెప్ ప్రామాణీకరణ ధృవీకరణను పొందడానికి కూడా ప్రయత్నించాలి. మాల్వేర్ నుండి తన సిస్టమ్‌ని రక్షించడానికి మనం తప్పనిసరిగా యాంటీవైరస్‌ను ఉపయోగించాలి. ఎప్పటికప్పుడు పరికరాన్ని రక్షించడానికి స్కాన్‌ను క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి. చెల్లింపు వ్యవస్థలో ఏదైనా వ్యత్యాసం ఉన్నట్లయితే, దానిని వెంటనే బ్యాంక్ దృష్టికి తీసుకు వెళ్ళాలి. ఒక చిన్న అనుమానాస్పద లావాదేవీ మీ ఎకౌంట్ లో జరిగినట్టు మీకు అనిపించినా దానిని సంబంధిత బ్యాంకు అధికారులకు తెలియపరచాలి. దీని ద్వారా ఎకౌంట్ లో ఏదైనా సమస్య వుంటే బ్యాంక్ పరిష్కరించే అవకాశం ఉంటుంది.
Also Read: Brain Eating Amoeba: అగ్రరాజ్యంలో మళ్ళీ మెదడు తినే అమీబా వెలుగులోకి.. చికిత్స పొందుతూ మృతి..
American Hospital: ఆస్పత్రిలో ఏడ్చిన యువతి.. సర్జరీ బిల్లుతో పాటు ‘ఎమోషనల్ బిల్లు’ వేసిన సిబ్బంది