Redmi A2+ Smartphone: అతి తక్కువ ధరలో సూపర్ స్మార్ట్ ఫోన్ ఇది.. బ్యాటరీ ఒక్కసారి చార్జ్ చేస్తే 32 రోజుల వరకూ స్టాండ్ బై..

| Edited By: TV9 Telugu

Aug 25, 2023 | 9:00 PM

ఇటీవల రెడ్ మీ ఏ2 ప్లస్ ఫోన్ ను సరికొత్త కాన్ఫిగరేషన్ తో ఆవిష్కరించింది. వాస్తవానికి ఈ స్మార్ట్ ఫోన్ ని రెడ్ మీ ఈ ఏడాదే మార్చిలోనే లాంచ్ చేసింది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ దీనిని తీసుకొచ్చింది. అయితే దీనిని ఇప్పుడు మరింత అప్ గ్రేడ్ చేసింది. ర్యామ్ సైజ్ మార్చలేదు గానీ స్టోరేజ్ పరిధిని పెంచింది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ని మార్కెట్లోకి తీసుకొచ్చింది.

Redmi A2+ Smartphone: అతి తక్కువ ధరలో సూపర్ స్మార్ట్ ఫోన్ ఇది.. బ్యాటరీ ఒక్కసారి చార్జ్ చేస్తే 32 రోజుల వరకూ స్టాండ్ బై..
Redmi A2plus
Follow us on

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్ మీ తన పాత ఫోన్లను సరికొత్తగా అప్ డేట్ చేసి రీలాంచ్ చేస్తోంది. అత్యంత జనాదరణ పొందిన మోడళ్లను ర్యామ్, రోమ్ సైజ్ లను పెంచుతూ.. కొత్త ఫీచర్లను యాడ్ చేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఇటీవల రెడ్ మీ ఏ2 ప్లస్ ఫోన్ ను సరికొత్త కాన్ఫిగరేషన్ తో ఆవిష్కరించింది. వాస్తవానికి ఈ స్మార్ట్ ఫోన్ ని రెడ్ మీ ఈ ఏడాదే మార్చిలోనే లాంచ్ చేసింది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ దీనిని తీసుకొచ్చింది. అయితే దీనిని ఇప్పుడు మరింత అప్ గ్రేడ్ చేసింది. ర్యామ్ సైజ్ మార్చలేదు గానీ స్టోరేజ్ పరిధిని పెంచింది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీనిలో మీడియా టెక్ హీలియో జీ36ఎస్ఓసీ ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తోంది. ఈ ఫోన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

రెడ్ మీ ఏ2 ప్లస్ ధర, లభ్యత..

రెడ్ మీ కొత్త ఏ2 ప్లస్ స్మార్ట్ ఫోన్ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 8,499గా ఉంది. ఇది ఎంఐ.కామ్, అమెజాన్, జియోమీ రిటైల్ పార్టనర్స్ వద్ద లభిస్తోంది. అంతేకాక పాత వేరియంట్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఫోన్ రూ. 7,999కే లభిస్తోంది. క్లాసిక్ బ్లాక్, జీ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి.

రెడ్ మీ ఏ2 ప్లస్ స్పెసిఫికేషన్లు..

ఈ స్మార్ట్ ఫోన్లో 6.52 అంగుళాల హెచ్ డీ ప్లస్ ఎల్సీడీ డిస్ ప్లే ఉంటుంది. 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. మీడియా టెక్ హీలియో జీ36ఎస్ఓసీ చిప్ సెట్ ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్ డ్యూయల్ సిమ్ ను సపొర్టు చేస్తుంది. దీనిలో మెమరీ ఫ్యూజన్ టెక్నాలజీ ఉంది. ఇది 3జీ బీ వరకూ ర్యామ్ ని స్టోరేజ్ నుంచి తీసుకోగలుగుతుంది. తద్వారా ర్యామ్ సైజ్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రెడ్ ఏ2 ప్లస్ ఫోన్ వెనుక వైపు ఏఐ ఆధారిత డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 8ఎంపీ ప్రైమరీ కెమెరా సెన్సార్, క్యూవీజీఏ కెమెరా ఉంటుంది. ముందు వైపు సెల్ఫీల కోసం 5ఎంపీ కెమెరా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

బ్యాటరీ సామర్థ్యం..

ఈ ఫోన్ లో 5,000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే 32 గంటల కాల్ టైంని అందిస్తుంది. అదే స్టాండ్ బై మోడ్లో ఉంచితే 32 రోజుల వరకూ పనిచేస్తుంది. దీనిలో 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..