కస్టమర్లకు రెడ్‌మీ సర్‌ప్రైజ్‌..!

అనతికాలంలోనే కస్టమర్ల మనసును దోచుకున్న చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ రెడ్‌మీ.. ఇప్పుడు మరింత దగ్గరయ్యేందుకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్స్‌ మొబైల్స్‌ను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో రెడ్‌మీ 9సిరీస్‌ ఫోన్లు విడుదల చేయబోతుందని అంతా వెయిట్ చేస్తున్న తరుణంలో.. కస్లమర్లకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.9సిరీస్ లాంచింగ్ ప్లేసులో రెడ్‌మీ 8ఏ డ్యూయల్ పేరుతో బడ్జెట్ ధరలో సరికొత్త మోడల్‌ను భారత్‌ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. గతంలో వచ్చిన 8ఏ మోడల్‌కు కొనసాగింపుగా 8ఏ డ్యూయల్‌ను తీసుకొచ్చింది. ఈ […]

కస్టమర్లకు రెడ్‌మీ సర్‌ప్రైజ్‌..!

అనతికాలంలోనే కస్టమర్ల మనసును దోచుకున్న చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ రెడ్‌మీ.. ఇప్పుడు మరింత దగ్గరయ్యేందుకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్స్‌ మొబైల్స్‌ను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో రెడ్‌మీ 9సిరీస్‌ ఫోన్లు విడుదల చేయబోతుందని అంతా వెయిట్ చేస్తున్న తరుణంలో.. కస్లమర్లకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.9సిరీస్ లాంచింగ్ ప్లేసులో రెడ్‌మీ 8ఏ డ్యూయల్ పేరుతో బడ్జెట్ ధరలో సరికొత్త మోడల్‌ను భారత్‌ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. గతంలో వచ్చిన 8ఏ మోడల్‌కు కొనసాగింపుగా 8ఏ డ్యూయల్‌ను తీసుకొచ్చింది.

ఈ మొడల్‌లో కొత్తగా వెనకవైపున రెండు కెమెరాలను పెట్టారు. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2ఎంపీ డెప్త్‌ సెన్సార్ కెమెరాను దీనిలో అమర్చారు. ఇక సెల్ఫీ ప్రియుల కోసం.. ఫ్రంట్ కెమెరాను 8 మెగాపిక్సెల్‌తో సెట్ చేశారు. ఇక డిస్‌ప్లే..
6.22 అంగుళాలు ఉంది. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. కాల్వ్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 439 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను ఇందులో వాడారు.

ఆండ్రాయిడ్ 9 పై ఓఎస్‌ ఆధారిత ఎమ్‌ఐయుఐ 11తో ఈ ఫోన్‌ వర్క్ అవుతోంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000ఎమ్‌ఏహెచ్‌ కెపాసిటీతో లభ్యమవుతోంది. 18వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో పాటు.. రివర్స్‌ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్‌ చేస్తుంది. మొత్తం రెండు వేరియంట్లలో ఈ 8ఏ డ్యూయల్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇక 2జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ కల్గిన ఫోన్ ధరను రూ.6,499గా నిర్ణయించారు. 3జీబీ ర్యామ్‌, 32జీబీ ఇంటర్నల్ మెమొరీ ఫోన్‌ను రూ.6,999గా ఉంది.

Click on your DTH Provider to Add TV9 Telugu