Realme 8: బయటకు వచ్చిన రియల్‌మీ 8 స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్లు ..ఈ మొబైల్‌లో చాలా ప్రత్యేకతలు..!

|

Mar 05, 2021 | 5:52 AM

Realme 8: ప్రస్తుతం వినియోగదారులను మరింత ఆకట్టుకునే విధంగా స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థలు రోజురోజుకు కొత్త ఫీచర్లతో మొబైళ్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి.తాజాగా ప్రముఖ

Realme 8: బయటకు వచ్చిన రియల్‌మీ 8 స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్లు ..ఈ మొబైల్‌లో చాలా ప్రత్యేకతలు..!
Follow us on

Realme 8: ప్రస్తుతం వినియోగదారులను మరింత ఆకట్టుకునే విధంగా స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థలు రోజురోజుకు కొత్త ఫీచర్లతో మొబైళ్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి.తాజాగా ప్రముఖ మొబైల్‌ ఫోన్‌ సంస్థ రియల్‌మీ ఈ ఏడాది ప్రారంభం నుంచి వరుసగా స్మార్ట్‌ మొబైల్‌లను విడుదల చేస్తూ వస్తోంది. గత కొన్ని రోజుల కిందటనే రియల్​మీ నార్జో 30 సిరీస్​ను విడుదల చేయగా, ఇప్పడు రియల్​మీ 8 సిరీస్​విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలే, 108 మెగా పిక్సెల్​ కెమెరాతో రియల్‌మీ 8 ప్రో స్మార్ట్​ఫోన్​ను విడుదల చేయనున్నట్లు ప్రకటించి స్మార్ట్​ఫోన్​ ప్రియుల చూపు తన వైపు తిప్పుకునేలా చేసింది.

ఇక ఈ ప్రకటన విడుదలైన మరుసటి రోజే రియల్‌మీ 8 స్మార్ట్​ఫోన్​కు సంబంధించిన స్పెసిఫికేషన్ ల​ను, ప్రత్యేకతలను తన ట్విట్టర్​ వేదిక ద్వారా వివరించారు రియల్​మీ సీఈవో మాధవ్ శేత్.రియల్​మీ 8ప్రో డిజైన్​తో పాటు రియల్‌మీ 8 రిటైల్ బాక్స్‌ ఫోటోలను తన ట్విట్టర్​ ఖాతా ద్వారా పోస్ట్​​చేశారు. ఈ ఫోటోలోని రియల్‌మీ 8 రిటైల్ బాక్స్ వెనుక భాగాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే… దీని స్పెసిఫికేషన్లు, ఫీచర్లకు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. అంతేకాక, రియల్​మీ 8 స్మార్ట్​ఫోన్​లో అందించే ఫీచర్లపై సంస్థ సీఈవో మాధవ్​ శేత్ కొంత సమాచారమిచ్చారు. మాధవ్​ శేత్​ పేర్కొన్న స్పెసిఫికేషన్ల ప్రకారం..

రియల్‌మీ 8 స్మార్ట్​ఫోన్​ 6.4 -అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది మీడియాటెక్ హీలియో జి 95 ప్రాసెసర్ ద్వారా శక్తిమంతంగా పనిచేస్తుంది. ఇక, కెమెరా విషయానికొస్తే.. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించినట్లు తెలుస్తోంది. రియల్‌మీ 8 స్మార్ట్​ఫోన్​లో 5,000mAh శక్తిమంతమైన బ్యాటరీని అందించడం విశేషం. అంతేకాక, ఇది 30W డార్ట్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్​ ఇస్తుంది. ఇక రియల్‌మీ 8 సూపర్ స్లిమ్, లైట్ డిజైన్‌ను కలిగి ఉంటుందని రిటైల్ బాక్స్​ను పరిశీలిస్తే తెలుస్తోంది.

మీడియాటెక్​ హెలియో ఎస్​ఓసీ ప్రాసెసర్​తో..

అలాగే సోషల్‌ మీడిలో షేర్‌ చేసిన దానిని పరిశీలిస్తే .. రియల్‌మీ 8 ప్రో డిజైన్​ను కూడా పరిశీలించవచ్చు. ఈ స్మార్ట్​ఫోన్ “డేర్ టు లీప్” అనే ట్యాగ్‌లైన్‌తో అందుబాటులోకి వస్తుందని ఫోటోను బట్టి తెలుస్తోంది. కాగా, దీనిలో క్వాడ్ రేర్ కెమెరా సెటప్‌ను అందించింది. ఈ క్వాడ్ రేర్​ కెమెరాలో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ కెమెరాతో పాటు హై రిజల్యూషన్​ సెల్ఫీ కెమెరాను అందించనట్లు స్పష్టంగా పేర్కొంది. ఇదిలా ఉంటే, రియల్‌మే 8 ప్రో ఇప్పటికే 108 మెగాపిక్సెల్ ప్రైమరీ శామ్‌సంగ్ హెచ్‌ఎం 2 షూటర్‌ కెమెరాతో చేయనున్నట్లు రియల్​మీ ధృవీకరించబడింది. ఇది వెలుతురు, చీకటి రెండు వాతావరణాల్లో కూడా బ్యాలెన్స్​డ్​ ఎక్స్​పోజర్​తో నాణ్యమైన ఫోటోలను తీయగలదు. ఈ స్పెసిఫికేషన్లన్నీ రియల్ మీ లవర్స్​ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఇవీ చదవండి :

Bajaj platina: కొత్త వేరియేషన్‌లో వచ్చిన మైలేజ్ కింగ్ బజాజ్‌ ప్లాటినా-100.. అనువైన ధరలలో అందుబాటులోకి..

Gold Price: రూ.40వేల దిగువకు బంగారం..? పసిడి ధరలు ఎందుకు క్షీణిస్తున్నాయి.. ఏడు నెలల్లో రూ.12వేలకుపైగా తగ్గిన పుత్తడి ధర