Railway Track Facts: రైల్వే ట్రాక్స్‌ తుప్పు పట్టకపోవడానికి కారణం ఏమిటి..?

Railway Track Facts: మన రైలు పట్టాల (Train Track)ను చూస్తుంటాము. అయితే ఇనుము కొన్ని రోజుల తర్వాత తుప్పు పడుతుంటుంది. కానీ రైలు పట్టాలు మాత్రం తుప్పు పట్టవు...

Railway Track Facts:  రైల్వే ట్రాక్స్‌ తుప్పు పట్టకపోవడానికి కారణం ఏమిటి..?

Updated on: Feb 24, 2022 | 12:49 PM

Railway Track Facts: మన రైలు పట్టాల (Train Track)ను చూస్తుంటాము. అయితే ఇనుము కొన్ని రోజుల తర్వాత తుప్పు పడుతుంటుంది. కానీ రైలు పట్టాలు మాత్రం తుప్పు పట్టవు. ఇలా ఎందుకు తుప్పు పట్టవో పెద్దగా ఆలోచించి ఉండము. పట్టాలు (Track) తుప్పు పట్టకపోవడానికి కారణాలు కూడా ఉన్నాయి. రైలు (Train) వెళ్లే పట్టాలు ఇనుముతో చేసి ఉంటాయి. ఇనుము అనేది ఎండకు ఎండుతూ వానకు తడుస్తుండటంతో తుప్పు పడుతుంటుంది. కానీ రైలు పట్టాలు మాత్రం తుప్పు పట్టవు. అలా తుప్పు పట్టినట్లయితే ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. రైల్వే ట్రాక్స్‌ ఇనుముతో చేసేవే అయినప్పటికీ.. వాటికి వినియోగించే ఉక్కు అధిక నాణ్యత కలిగి ఉంటుంది. ఈ ఉక్కులో 1 శాతం కార్బన్, 12 శాతం మాంగనీస్ కలిసి ఉంటుంది. అందుకే దీనిని ‘సి-ఎంఎన్’ రైల్ స్టీల్ అని పిలుస్తారు. దీని కారణంగా తుప్పు పట్టడం చాలా తక్కువ అని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఒకవేళ తుప్పు పట్టినా.. తుప్పు రేటు సంవత్సరానికి 0.05 మి.మీ ఉంటుందట. అంటే 1 మి.మీ మేర తుప్పు పట్టడానికి 20 సంవత్సరాలు పడుతుంది. ఇక పట్టాలపై ఎప్పుడు రైలు ప్రయాణిస్తూనే ఉంటుంది కాబట్టి .. రైలు చక్రాల ఒత్తిడి కారణంగా పట్టాలు ఎప్పుడు పాలిష్ చేసిన మాదిరి మెరుస్తుంటాయి. అందుకే తుప్పు పట్టే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు కొంచెం పట్టాలు తేడా అనిపించినా రైల్వే సిబ్బంది వెంటనే ఆ పట్టాలను మార్చేస్తుంటారు. రైలు పట్టాలకు తుప్పు పట్టకుండా ఓ కోటింగ్ కూడా వేస్తారు. అలాగే రైళ్లు వెళ్తున్న సమయంలో పట్టాలు ఒత్తిడికి గురై తుప్పు పట్టవు.

ఇనుముకు తుప్పు ఎందుకు పడుతుంది..?

రైలు పట్టాలు తుప్పు పట్టకపోయినా..సాధారణం ఇనుముతో తయారు చేసిన వస్తువులు తుప్పు పడుతుంటాయి. తడిగా ఉన్నా, గాలిలో ఆక్సిజన్‌తో ప్రతిస్పందించినప్పుడు లేదా తడిగా ఉన్నప్పుడు ఇనుముపై గోధుమ రంగు ఐరన్‌ ఆక్సైడ్‌ నిక్షిప్తం చేయబడుతుంది. ఈ గోధుమ రంగు పూత ఇనుము ఆక్సిజన్‌తో ప్రతిస్పందించి ఐరన్‌ ఆక్సైడ్‌ ఏర్పడుతుంది. దీని కారణంగా తుప్పు పడుతుంది. ఇది తేమ కారణంగా జరుగుతుంది.

ఇవి కూడా చదవండి:

Indian Railway: థర్డ్‌ ఏసీ, ఎసీ-3 ఎకానమీ కోచ్‌ల మధ్య తేడా ఏమిటి..? ఈ కోచ్‌లు ఇతర వాటికి భిన్నంగా ఎందుకుంటాయి..?

Railway Crossing: రైల్వే ట్రాక్‌లపై W/L అనే బోర్డు ఎందుకు ఉంటుంది.. పూర్తి వివరాలు

Loading...
Unable to load recommendations.
Follow Us