AI యూజర్లకు బిగ్‌ అప్డేట్‌.. అడల్ట్ మోడ్ ఫీచర్‌పై నిర్ణయం మార్చుకున్న OpenAI?

OpenAI చాట్‌జీపీటీ అడల్ట్ మోడ్‌ను నిరవధికంగా వాయిదా వేసింది. వినియోగదారుల భద్రత, పెట్టుబడిదారుల ఒత్తిడి, అంతర్గత అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మైనర్లకు అనుచిత కంటెంట్ చేరే ప్రమాదంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

AI యూజర్లకు బిగ్‌ అప్డేట్‌.. అడల్ట్ మోడ్ ఫీచర్‌పై నిర్ణయం మార్చుకున్న OpenAI?
Openai Gpt

Updated on: Mar 28, 2026 | 8:55 PM

ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసిన చాట్‌జీపీటీ అడల్ట్ మోడ్‌పై OpenAI కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సంస్థ ఈ ఫీచర్ అభివృద్ధిని నిరవధికంగా నిలిపివేసిందని అంతర్జాతీయ మీడియా నివేదికలు వెల్లడించాయి. ముఖ్యంగా పెట్టుబడిదారుల ఒత్తిడి, వినియోగదారుల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం వయోజన యూజర్లకు లైంగికంగా స్పష్టమైన సంభాషణలను అనుమతించే విధంగా రూపొందించిన ఈ ఫీచర్‌ను తాత్కాలికంగా కాకుండా దీర్ఘకాలానికి వాయిదా వేసినట్లు పేర్కొంది. గతంలో ఓపెన్‌ ఏఐ సీఈఓ సామ్‌ ఆల్టమన్‌ ఈ అడల్ట్ మోడ్‌ను ప్రకటించినప్పటికీ, అంతర్గతంగా మరియు బాహ్యంగా వచ్చిన విమర్శలు దీనిపై ప్రభావం చూపాయి.

సంస్థ అంతర్గతంగా ఈ ఫీచర్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఏఐపై వినియోగదారులు అధిక భావోద్వేగ ఆధారపడటం, అలాగే మైనర్లకు అనుచిత కంటెంట్ చేరే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు హెచ్చరించారు. ఈ అంశాలపై మరింత పరిశోధన అవసరమని సంస్థ సలహా మండలి సూచించినట్లు సమాచారం. ఇక వ్యూహాత్మకంగా OpenAI ప్రస్తుతం తన ప్రధాన ఉత్పత్తులైన చాట్‌జీపీటీ, కోడెక్స్‌పై దృష్టి కేంద్రీకరిస్తోంది. ఎంటర్‌ప్రైజ్ వినియోగదారులను ఆకర్షించడం, పెట్టుబడులను పెంచుకోవడం లక్ష్యంగా సంస్థ ఈ మార్పులు చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో పోటీదారైన ఆంత్రోపిక్‌ను అధిగమించే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి.

ఇటీవల ఏఐ రంగంలో నియంత్రణ, నైతికతపై చర్చలు పెరుగుతున్నాయి. ఉదాహరణకు xAI రూపొందించిన గ్రోక్ చాట్‌బాట్‌పై కూడా వివాదాలు చెలరేగాయి. వినియోగదారులు దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నందున ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. మొత్తంగా చాట్‌జీపీటీ అడల్ట్ మోడ్‌ను నిలిపివేయడం ద్వారా OpenAI సురక్షిత, బాధ్యతాయుత ఏఐ అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us