ChatGPT: ఇకపై చాట్‌ జీపీటీతో మాట్లాడొచ్చు.. అందుబాటులోకి అదిరిపోయే ఫీచర్స్‌..

|

Sep 26, 2023 | 10:15 PM

ఇంతలా అడ్వాన్స్‌ టెక్నాలజీతో కూడుకున్న చాట్‌ జీపీటీ సేవలు అందుబాటులోకి వచ్చి సరిగ్గా ఏడాది ముగుస్తోంది. ఈ సందర్భంగా ఇందులో మరికొన్ని అధునాతన ఫీచర్లను జోడించారు. ఈ కొత్త ఫీచర్స్‌తో చాట్‌ జీపీటీ మరింత అత్యాధునికంగా మారిపోనుంది. ఇకపై చాట్‌ జీపీటీతో యూజర్లు నేరుగా మాట్లాడి, తమ సందేహాలను తీర్చుకోవచ్చు. అలాగే ఇమేజ్‌ రూపంలో కమాండ్స్ ఇచ్చే సేవల్ని...

ChatGPT: ఇకపై చాట్‌ జీపీటీతో మాట్లాడొచ్చు.. అందుబాటులోకి అదిరిపోయే ఫీచర్స్‌..
Chat Gpt
Follow us on

ప్రస్తుతం టెక్‌ ప్రపంచాన్ని చాట్‌ జీపీటీ శాసిస్తోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా రూపొందించిన ఈ సేవలు ప్రపంచాన్ని ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది. ఓపెన్ ఏఐ అనే సంస్థ రూపొందించిన చాట్‌ జీపీటీతో జరగని పని అంటూ ఉండదు. ఏ సమాధానం కావాలన్నా చాట్‌ జీపీటీ క్షణాల్లో చెప్పేస్తుంది. చివరికి ఒక లైన్‌ ఇచ్చి కథను, పాటను రాసేయమన్నా రాసేస్తుంది.

ఇంతలా అడ్వాన్స్‌ టెక్నాలజీతో కూడుకున్న చాట్‌ జీపీటీ సేవలు అందుబాటులోకి వచ్చి సరిగ్గా ఏడాది ముగుస్తోంది. ఈ సందర్భంగా ఇందులో మరికొన్ని అధునాతన ఫీచర్లను జోడించారు. ఈ కొత్త ఫీచర్స్‌తో చాట్‌ జీపీటీ మరింత అత్యాధునికంగా మారిపోనుంది. ఇకపై చాట్‌ జీపీటీతో యూజర్లు నేరుగా మాట్లాడి, తమ సందేహాలను తీర్చుకోవచ్చు. అలాగే ఇమేజ్‌ రూపంలో కమాండ్స్ ఇచ్చే సేవల్ని త్వరలోనే తీసుకురానున్నారు. ఈ విషయాన్ని ఓపెన్‌ ఏఐ తన బ్లాగ్‌ పోస్ట్‌లో తెలిపింది.

ఇప్పటి వరకు చాట్‌ జీపీటీలో కేవలం టెక్ట్స్‌, వాయిస్‌ రూపంలోనే సందేహాలు అడిగే అవకాశం ఉంది. చాట్‌ జీపీటీ ఈ ప్రశ్నలకు టెక్ట్స్‌ రూపంలోనే సమాధానం ఇస్తుంది. అయితే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పే సమయంలో, మరో ప్రశ్నను అడగడానికి వీలుండదు. కానీ చాట్‌జీపీటీ తీసుకురానున్న కొత్త వాయిస్‌ ఫీచర్‌తో సహాయంతో వాయిస్‌ రూపంలో ఏదైనా ప్రశ్నకు అడిగిన వెంటనే చాట్‌ జీపీటీ సైతం వాయిస్ రూపంలోనే సమాధానం ఇస్తుంది.

చాట్ జీపీటీ ట్వీట్..

ఇక చాట్ జీపీటీలో మరో కొత్త ఫీచర్‌ను జోడించనుంది. ఈ ఫీచర్‌ సహాయంతో ఇమేజ్‌ ద్వారా కూడా మన సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఓపెన్‌ ఏఐ ఓ ట్వీట్‌ను చేసింది. మీకు కావాల్సిన ఫొటోను అప్‌లోడ్ చేసి దానికి సంబంధించి ఏదైనా ప్రశ్నను సంధిస్తే వెంటనే సమాధానం చెప్పేస్తుంది. ఓపెన్‌ ఏఐ చేసిన ట్వీట్‌లో ఒక సైకిల్ ఫొటోను అప్‌లోడ్ చేసి, సైకిల్ సీటు తగ్గించడానికి ఏం చేయాలని ప్రశ్నించారనుకోండి.. వెంటనే సమాధానం ఇచ్చేస్తుంది. ఈ రెండు కొత్త ఫీచర్స్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫీచర్స్‌ ప్రస్తుతం చాట్‌జీపీటీ ప్లస్‌, ఎంటర్‌ప్రైజ్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..