OnePlus 10R 5G: వన్‌ప్లస్ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. 150W ఫాస్ట్ చార్జింగ్‌.. రెండు మోడళ్లలో విడుదల

|

May 04, 2022 | 12:31 PM

OnePlus 10R 5G: మార్కెట్లో రకరకాల స్మార్ట్ ఫోన్లు విడుదలవుతున్నాయి. టెక్నాలజీని అందిపుచ్చుకుని మంచి ఫీచర్స్‌తో ఫోన్‌లను తీసుకువస్తున్నాయి ఆయా మొబైల్‌ తయారీ కంపెనీలు..

OnePlus 10R 5G: వన్‌ప్లస్ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. 150W ఫాస్ట్ చార్జింగ్‌.. రెండు మోడళ్లలో విడుదల
OnePlus 10R 5G
Follow us on

OnePlus 10R 5G: మార్కెట్లో రకరకాల స్మార్ట్ ఫోన్లు విడుదలవుతున్నాయి. టెక్నాలజీని అందిపుచ్చుకుని మంచి ఫీచర్స్‌తో ఫోన్‌లను తీసుకువస్తున్నాయి ఆయా మొబైల్‌ తయారీ కంపెనీలు. పోటాపోటీగా మార్కెట్లో కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి కంపెనీలు. ఇక అత్యంత వేగవంతమైన చార్జింగ్ సపోర్ట్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌గా వన్‌ప్లస్‌ 10ఆర్ 5జీ (OnePlus 10R 5G). ఇది ఇండియాలో విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 150వాట్ల SuperVOOC ఫాస్ట్ చార్జింగ్‌తో పాటు 80వాట్ల SuperVOOC ఫాస్ట్ చార్జింగ్ మోడల్‌ కూడా విడుదల చేసింది. గేమింగ్ బెస్ట్‌గా ఉండేలా కూలింగ్ సిస్టమ్ కూడా అందించింది. ఇందులో హైపర్‌బూస్ట్ ఇంజిన్ కూడా ఉంది. కొత్త మీడియాటెక్ డైమన్సిటీ 8100-మ్యాక్స్ ప్రాసెసర్‌ తీసుకవచ్చింది. అలాగే స్టీరియో స్పీకర్లు, 120Hz అమోలెడి డిస్‌ప్లే లాంటి మంచి ఫీచర్లతో వస్తోంది. ఇక OnePlus 10R 5Gకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

వన్‌ప్లస్‌ 10ఆర్ 5జీ స్పెసిఫికేషన్లు:

ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల Full-HD+ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌ రేట్, 720Hz టచ్ రెస్పాన్స్ రేట్, 2.5D కర్వ్‌డ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటాయి. MediaTek Dimensity 8100-Max ప్రాసెసర్‌తో ఉంటుంది. ఇందులో 8GB ర్యామ్‌+128 ఇంటర్నల్‌ స్టోరేజీతో ఉండే ఫోన్‌ ధర రూ.38,999 ఉండగా, 12GB ర్యామ్‌+256GB ఇంటర్నల్‌ స్టోరేజీతో ఉన్న ఫోన్‌ ధర రూ.42,999 ఉంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో కూడిన ఆక్సిజన్ఓఎస్ 12.1తో ఈ మొబైల్‌ మార్కెట్లో విడుదలైంద.ఇ

కెమెరా విషయానికొస్తే..

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ కెమెరా విషయానికొస్తే.. వెనుక మూడు కెమెరాలు ఉన్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50 మెగాపిక్సెల్ Sony IMX766 ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ Sony IMX355 అల్ట్రా వైడ్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. అంతేకాకుండా 16 మెగాపిక్సెల్ Samsung ISOCELL S5K3P9 సెన్సార్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఈ స్మార్ట్‌ఫోన్‌ల అందించింది వన్‌ప్లస్‌వన్‌. బ్యాటరీ రెండు మోడళ్లల వరుసగా 4500mAh, 5000mAh సామర్థ్యంతో ఉన్నాయి. వీటికి 150W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్‌, 80W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను ఉంటుంది. ఇవేకాకుండా మరిన్ని అత్యాధునిక ఫీచర్స్‌ను ఈ ఫోన్‌లో అందించింది కంపెనీ. ఈ మొబైల్‌లను మే 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, వన్‌ప్లస్‌ ఆన్‌లైన్ స్టోర్, రిలయన్స్ డిజిటల్, క్రోమాతో పాటు ఎంపిక చేసిన ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌లో OnePlus 10R 5G సేల్‌కు అందుబాటులోకి రానున్నాయి.

 


మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

Strong Password: మీ అకౌంట్‌కు హ్యాకర్లు గుర్తుపట్టలేని పాస్‌వర్డ్‌లు ఉండాలంటే ఇవి వాడండి..!

Vivo Smartphones: ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ ధరలను తగ్గించిన వివో.. కొత్త రేట్లను తెలుసుకోండి