Uber Booking: ఎక్కడైన వెళ్లాలంటే క్యాబ్ బుకింగ్ అందుబాటులో ఉంటుంది. ఎక్కడికి వెళ్లాలన్నా ఇంట్లోనే ఉండి క్యాబ్‌ను బుకింగ్ చేసుకోవచ్చు. అయితే ఈ బుకింగ్ చేసుకోవాలంటే ఇంగ్లీష్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా మందికి ఇంగ్లీష్‌లో ఇబ్బందిగా ఉంటుంది. దీని కారణంగా మీ కోసం క్యాబ్‌ని బుక్ చేసుకోవడం మీకు కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. హిందీలో వాట్సాప్‌లో ఉబెర్ రైడ్‌ను బుక్ చేసుకోచ్చు. ఉబెర్ ఢిల్లీ NCRలో తన వినియోగదారుల కోసం వాట్సాప్ టు రైడ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిది. ఈ కొత్త ఫీచర్ సహాయంతో, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో నివసించే వ్యక్తులు తమ WhatsApp చాట్‌బాట్ నుండి Uber రైడ్‌లను బుక్ చేసుకోగలరు.
హిందీలో సర్వీస్..
Uber మొదట 2021లో లక్నోలో WhatsApp ద్వారా క్యాబ్‌లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని ప్రారంభించింది. అయితే అప్పుడు ఈ సదుపాయం కేవలం ఇంగ్లీషు భాషలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్‌లో హిందీ భాషను WA2R ఫీచర్‌లో చేర్చింది. ఇంగ్లిష్‌లో ఇబ్బంది పడేవారు హిందీలో బుక్ చేసుకునేందుకు వీలుంటుంది. భవిష్యత్తులో WA2R ఫీచర్‌ను మరింత మెరుగుపరుస్తామని, తద్వారా తమ యాప్‌లో ఇప్పటికే ఉన్న వినియోగదారులు కూడా WhatsApp ద్వారా క్యాబ్‌లను బుక్ చేసుకోవచ్చని ఉబెర్ తెలిపింది.
రైడ్‌ను ఎలా బుక్ చేసుకోవాలి:
వినియోగదారులు మూడు సులభమైన మార్గాల్లో Uber రైడ్‌ను బుక్ చేసుకోవచ్చు. మొదటి పద్ధతి Uber అకౌంట్ నంబర్‌కు సందేశం పంపడం, రెండవ పద్ధతి QR కోడ్‌ని స్కాన్ చేయడం, మూడవ పద్ధతి లింక్‌పై క్లిక్ చేసి Uber WhatsApp చాట్‌ను నేరుగా తెరవడం. వాట్సాప్‌ని ఉపయోగించి మీరు ఉబెర్ క్యాబ్‌ను ఎలా బుక్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. మీరు మీ whatsapp నుండి 72920 00002 కి హాయ్ అని పంపండి. మీరు సందేశం పంపినప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. మీరు ఈ OTPని నమోదు చేసిన తర్వాత మీ పిక్-అప్, డ్రాప్ లొకేషన్ సమాచారం అడుగుతుంది. దీని తర్వాత మీరు uber go, auto, moto మొదలైన రైడ్ ల వంటి వివరాలు కనిపిస్తాయి. దీని తర్వాత ఛార్జీలు, క్యాబ్ మీ వద్దకు వచ్చే సమయంలో కనిపిస్తుంది. రైడ్‌ని నిర్ధారించిన తర్వాత మీ క్యాబ్ బుక్ అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి