Flipkart: మీ పాత ఫోన్‌ను అమ్మేయాలనుకుంటున్నారా.? ఫ్లిక్‌కార్ట్‌తో మీ పని మరింత ఈజీ..

|

Feb 15, 2022 | 3:47 PM

Flipkart: ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. మార్కెట్లో వారానికో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ సందడి చేస్తోంది. ఒక ఫోన్‌కు మించిన ఫీచర్లతో మరో ఫోన్‌ మార్కెట్లోకి దూసుకొస్తున్నాయి. ఇక కస్టమర్లు సైతం రెగ్యులర్‌గా ఫోన్‌లను...

Flipkart: మీ పాత ఫోన్‌ను అమ్మేయాలనుకుంటున్నారా.? ఫ్లిక్‌కార్ట్‌తో మీ పని మరింత ఈజీ..
Flipkart Sell Back
Follow us on

Flipkart: ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. మార్కెట్లో వారానికో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ సందడి చేస్తోంది. ఒక ఫోన్‌కు మించిన ఫీచర్లతో మరో ఫోన్‌ మార్కెట్లోకి దూసుకొస్తున్నాయి. ఇక కస్టమర్లు సైతం రెగ్యులర్‌గా ఫోన్‌లను మార్చడం ట్రెండ్‌లా మారింది. ఒక ఫోన్‌ను ఆరు నెలలు వాడితే మహా గొప్ప అన్నట్లు పరిస్థితులు మారాయి. దీనికి కారణం రోజుకో కొత్త ఫోన్‌ వస్తుండడమే. అయితే కొత్త ఫోన్‌ను కొనుగోలు చేస్తారు బాగానే ఉంది. కానీ.. పాత ఫోన్ల పరిస్థితి ఏంటి.? వాటిని మంచి ధరకు ఎక్కడ అమ్మేయాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు.

అయితే ఇలాంటి వారి కోసమే ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ యూజర్ల కోసం వినూత్న ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇకపై యూజర్లు తమ పాత ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్‌లో అమ్ముకునే వెసులు బాటును కల్పించింది. న్యూ సెల్‌ బ్యాక్‌ అనే ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. దీంతో కస్టమర్లు తమ ఫోన్లను ఫ్లిప్‌ కార్డ్‌లో అమ్ముకోవచ్చని ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. ఇదిలా ఉంటే నిజానికి ఇలా పాత ఫోన్‌లను అమ్ముకునే వెసులుబాటును కల్పిస్తూ యంత్ర అనే సంస్థ ఓ వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది. కానీ తాజాగా ఫ్లిప్‌కార్ట్‌ ఆ స్టార్టప్‌ను కొనుగోలు చేయడంతో ఈ సేవలను కూడా ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌లోకే తీసుకొచ్చారు.

దేశ వ్యాప్తంగా సుమారు 1700 పిన్‌కోడ్స్‌ ప్రాంతాల్లో కస్టమర్లకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి స్మార్ట్‌ఫోన్‌లను అమ్ముకునే అవకాశం కల్పిస్తున్న ఫ్లిప్‌కార్ట్‌ రానున్న రోజుల్లో ఇతర గ్యాడ్జె్ట్లను విక్రయించుకునే అవకాశం కల్పించనున్నారు. ఫ్లిప్‌కార్టులో ఫోన్‌ అమ్ముకునే సమయంలో మూడు ప్రశ్నలు అడుగుతారు. వాటికి సమాధానాలు ఇచ్చి ఫోన్‌ బ్రాండ్‌, మోడల్‌ను ఎంచుకోవాలి. ఇలా చేసిన 48 గంటల్లో ఫ్లిప్‌కార్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంటికి వచ్చి ఫోన్‌ను తీసుకుంటారు. ఇలా తీసుకున్న తర్వాత కస్టమర్లకు ఆ ఫోన్‌ ధర విలువ చేసే ఒక వోచర్‌ను అందిస్తారు. ఈ వోచర్‌తో యూజర్లు ఫ్లిప్‌కార్ట్‌లో తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు.

Also Read: అందాల తార సన్నీ లియోన్ లేటెస్ట్ ఫోటోస్

ఆగ్రా తాజ్ మాహల్ చూడటానికి బడ్జెట్ వివరాలు.

కళ్లతోనే మాయ చేసిన అలనాటి నటి.. అందం, అభినయం కలబోసిన ఈ సీతాకోకచిలుక ఎవరో గుర్తు పట్టండి చూద్దాం..