భూమిపై ఎనిమిదో ఖండం అదే..

| Edited By:

Jun 26, 2020 | 3:36 PM

భూమి మీద ఎన్ని ఖండాలు అని అడగ్గానే.. టక్కున ఏడు అని సమాధానం చెబుతాం. కానీ ఇప్పుడు భూమిపై ఎనిమిదో ఖండం కూడా ఉందని శాస్త్రవేత్తలు రుజువు చేశారు. ఆ ఖండం పేరే 'జిలాండియా'. ఇది న్యూజిలాండ్ దేశానికి దగ్గరలో ఉంది. 2017వ సంవత్సరంలో దీన్ని శాస్త్రవేత్తలు...

భూమిపై ఎనిమిదో ఖండం అదే..
Follow us on

భూమి మీద ఎన్ని ఖండాలు అని అడగ్గానే.. టక్కున ఏడు అని సమాధానం చెబుతాం. కానీ ఇప్పుడు భూమిపై ఎనిమిదో ఖండం కూడా ఉందని శాస్త్రవేత్తలు రుజువు చేశారు. ఆ ఖండం పేరే ‘జిలాండియా’. ఇది న్యూజిలాండ్ దేశానికి దగ్గరలో ఉంది. 2017వ సంవత్సరంలో దీన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఇప్పుడు మరోసారి ఇది చర్చగా మారింది. ఈ సందర్భంగా పలువురు శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. జిలాండియా ఖండం గురింంచి పలు విషయాలు చెప్పుకొచ్చారు. ఒకప్పుడు అన్ని ప్రాంతాల్లోలాగే ఈ ఖండం కూడా సముద్రంలో పైకి తేలుతూ ఉండేదట. కానీ కొన్ని కారణాల వల్ల ఇది సముద్రంలో కలిసిపోయింది.

జిలాండియా చిన్న ఖండం ఏమీ కాదని.. దాదాపు 50 లక్షల చదరపు కిలోమీట్ల విస్తీర్ణంలో ఇది వ్యాపించి ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బాతిమెట్రి అనే విధానం ద్వారా ఈ ఖండం మొక్క మ్యాప్‌ను తయారు చేశారు న్యూజిలాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు. 50 లక్షల చదరపు కిలోమీట్ల విస్తీర్ణంలో వ్యాపించిన జిలాండియా ఖండంలో కేవలం 6 శాతం మాత్రమే సముద్రంపైకి కనిపిస్తుంది. అక్కడ న్యూ క్యాలడోనియా దీవులు విస్తరించి ఉన్నాయి. 1995లోనే బ్రూస్ లుయెండిక్ అనే భౌతిక శాస్త్రవేత్త మొదట ఎనిమిదో ఖండాన్ని గుర్తించారని.. ఆయనే ఈ ఖండానికి జిలాండియా అనే పేరు పెట్టినట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

Read More: 

‘గూగుల్ పే’లో కొత్త ఫీచర్.. అప్పులు ఇచ్చేందుకు సిద్ధం..

కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్..

వీడియో వైరల్: బుల్లెట్ నడుపుతూ బోర్లాపడ్డ జెర్సీ హీరోయిన్..

బ్రేకింగ్: మరో సీరియల్ నటుడికి కరోనా.. షూటింగ్ రద్దు