ఆర్బీఐ గుడ్ న్యూస్.. ఇకపై డబ్బులు ఎప్పుడైనా పంపొచ్చు!

|

Dec 16, 2019 | 2:29 PM

బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ శుభవార్త అందించింది. ఇకపై ఖాతాదారులు తమ డబ్బును 24 గంటల్లో ఎప్పుడైనా ఆన్లైన్ ద్వారా పంపించుకోవచ్చు. కాగా, ఇవాళ్టి నుంచి నెఫ్ట్(నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్) సర్వీసులు 24/7 అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా ఈ సేవలు 365 రోజులూ ఉపయోగించుకోవచ్చు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నెఫ్ట్ సేవలు మామూలు రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కొనసాగుతుండగా.. శనివారాల్లో(మొదట, మూడు) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 […]

ఆర్బీఐ గుడ్ న్యూస్.. ఇకపై డబ్బులు ఎప్పుడైనా పంపొచ్చు!
Follow us on
బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ శుభవార్త అందించింది. ఇకపై ఖాతాదారులు తమ డబ్బును 24 గంటల్లో ఎప్పుడైనా ఆన్లైన్ ద్వారా పంపించుకోవచ్చు. కాగా, ఇవాళ్టి నుంచి నెఫ్ట్(నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్) సర్వీసులు 24/7 అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా ఈ సేవలు 365 రోజులూ ఉపయోగించుకోవచ్చు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నెఫ్ట్ సేవలు మామూలు రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కొనసాగుతుండగా.. శనివారాల్లో(మొదట, మూడు) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఖాతాదారులకు అందుబాటులో ఉన్నాయి. అంతేకాక లావాదేవీలు అన్ని కూడా గంటకోసారి సెటిల్ చేస్తున్నారు. ఇక ఇప్పటి నుంచి అర్ధరాత్రి 12.30 నుంచి రాత్రి 11.30 వరకు ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఇకపోతే పండగ రోజులు, సెలవు దినాలు అనేవి లేకుండా ఏ క్షణమైనా నగదును బదిలీ చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా నెఫ్ట్, ఆర్టీజీఎస్ లావాదేవీలపై ఎటువంటి అదనపు ఛార్జీలు కూడా లేవని ఆర్బీఐ స్పష్టం చేసింది. కాగా నెఫ్ట్ విధానంలో ఖాతాదారులకు లిమిట్ లేకపోగా.. ఆర్టీజిస్ విధానంలో మాత్రం రూ. 2 లక్షల వరకు నగదును బదిలీ చేసుకుని వెసులుబాటు ఉంది.