NASA Black Holes: నాసా పంపిన వింత దృశ్యం.. ఎక్కువ‌సేపు చూస్తే లోప‌లికే.. జాగ్రత్త !?

|

May 06, 2022 | 8:45 AM

NASA Black Holes: అంతరిక్షం గురించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు చెబుతున్న నాసా తాజాగా బ్లాక్‌హోల్‌కి సంబంధించిన వీడియోని రిలీజ్ చేసింది.

NASA Black Holes: నాసా పంపిన వింత దృశ్యం.. ఎక్కువ‌సేపు చూస్తే లోప‌లికే.. జాగ్రత్త !?
Nasa
Follow us on

NASA Black Holes: అంతరిక్షం గురించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు చెబుతున్న నాసా తాజాగా బ్లాక్‌హోల్‌కి సంబంధించిన వీడియోని రిలీజ్ చేసింది. ఎవరూ ఎప్పుడూ చూడని 22 బ్లాక్ హోల్స్ రేర్ విజువల్స్ ను విడుదల చేసింది నాసా. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా తెగ వైరల్‌ అవుతోంది. పైగా ఈ వీడియోకి ఓ గమ్మతైన క్యాప్షన్‌ కూడా ఇచ్చింది నాసా.. ‘‘ఈ వీడియోని ఎక్కువసేపు చూడకండి.. మిమ్మల్ని తనలోకి లాగేసుకుంటుంది’’ అని నాసా వీడియోకి సరదా క్యాప్షన్ ఇచ్చింది. ఇక‌, ఈ వీడియోను పోస్ట్ చేసిన 13 గంటల్లోనే 2 మిలియన్లకు పైగా వ్యూవ్స్ పొందింది.

అయితే, ఈ బ్లాక్ హోల్ అంటే కృష్ణ బిలం అని అంటారు. విజ్ఞాన శాస్త్ర ప్రపంచానికి అంతు చిక్కని ఎన్నో వింతలు జరిగే ప్రదేశం ఇది. సాధారణంగా ప్రతీ గెలాక్సీకి ఓ బ్లాక్ హోల్ సెంటర్ లో ఉంటుంది. కానీ, అది కనిపించదు.. చుట్టూ ఉన్న నక్షత్రాల కదలికలను బట్టి అక్కడ బ్లాక్ హోల్ ఉండి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తుంటారు. అంతే కాదు కనీసం కాంతి కూడా బ్లాక్ హోల్ నుంచి తప్పించుకోలేదు. మన శాస్త్రవేత్తలకు ఇప్పటి వరకూ చేసిన పరిశోధనల ఆధారంగా బ్లాక్ హోల్ అంటే మన సూర్యుడి కంటే 20 రెట్లు పెద్దవైన నక్షత్రాలు వాటి చివరిదశలో మండే గుణం కోల్పోయి బ్లాక్ హోల్స్ లోకి జారిపోతాయని అంచనా. అయితే, ప్రతీసారీ ఇలానే జరగాలని లేదని కూడా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. బ్లాక్‌హోల్‌ని భూమిపై నుంచి చూస్తే ఎలా ఉంటుంది? సైడ్ నుంచి చూస్తే ఎలా ఉంటుంది? దగ్గరకు వెళ్లి పై నుంచి చూస్తే ఎలా ఉంటుంది? అనేది వివరించింది. కాకపోతే, ఇది నిజమైన బ్లాక్ హోల్ కాదు. గ్రాఫికల్ ప్రజెంటేషన్ మాత్రమేనట.

ఇవి కూడా చదవండి