Moto G32: తక్కువ బడ్జెట్‌లో మోటోరోలా నుంచి కొత్త ఫోన్‌.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

|

Aug 09, 2022 | 7:45 PM

Moto G32: ఇటీవల వరుసగా స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది మోటోరోలా. ముఖ్యంగా బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్ చేసుకున్న ఈ కంపెనీ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మోటో జీ32 పేరుతో తీసుకొచ్చి ఈ స్మార్ట్‌ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లో...

Moto G32: తక్కువ బడ్జెట్‌లో మోటోరోలా నుంచి కొత్త ఫోన్‌.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Follow us on

Moto G32: ఇటీవల వరుసగా స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది మోటోరోలా. ముఖ్యంగా బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్ చేసుకున్న ఈ కంపెనీ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మోటో జీ32 పేరుతో తీసుకొచ్చి ఈ స్మార్ట్‌ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లో అందుబాటులోకి తెచ్చింది. పేరుకు తక్కువ బడ్జెట్‌ అయినా ఫీచర్ల విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడలేదు. మోటో జీ32 ఫోన్‌ ఫీచర్లు ఏంటి.? ధర ఎంతలాంటి పూర్తి వివరాలు మీకోసం..

ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో కూడిన 6.5 ఇంచెస్‌ డిస్‌ప్లేను అందించారు. స్నాప్‌డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 30 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. డ్యూయెల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.2 ఈ ఫోన్‌ ప్రత్యేకతలు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 10 మెగా పిక్సెల్‌తో కూడిన సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌ మొదటి సేల్‌ ఆగస్టు 16 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది.

ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్‌ + 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ రేట్‌ రూ. 12,999గా ఉంది. పలు బ్యాంకుల కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1250 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ను పొందొచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..