Microsoft: ప్రపంచాన్నే వణికించిన మైక్రోసాఫ్ట్‌ లోపం.. సమస్యను ఎలా పరిష్కరించాలో తెలిపిన కంపెనీ

|

Jul 19, 2024 | 5:31 PM

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ (Microsoft) సర్వర్లు నిలిచిపోయాయి. సర్వర్లలో లోపాలు తలెత్తడంతో ప్రపంచమే నిలిచిపోయేలా చేశాయి. దీని కారణంగా బ్యాంకుల నుండి విమానయాన సంస్థల వరకు సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పెద్ద ఎత్తున ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. బ్యాంకులు, స్టాక్ ఎక్స్ఛేంజీల పనితీరుపైనా ప్రభావం పడింది...

Microsoft: ప్రపంచాన్నే వణికించిన మైక్రోసాఫ్ట్‌ లోపం.. సమస్యను ఎలా పరిష్కరించాలో తెలిపిన కంపెనీ
Microsoft
Follow us on

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ (Microsoft) సర్వర్లు నిలిచిపోయాయి. సర్వర్లలో లోపాలు తలెత్తడంతో ప్రపంచమే నిలిచిపోయేలా చేశాయి. దీని కారణంగా బ్యాంకుల నుండి విమానయాన సంస్థల వరకు సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పెద్ద ఎత్తున ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. బ్యాంకులు, స్టాక్ ఎక్స్ఛేంజీల పనితీరుపైనా ప్రభావం పడింది. చాలా మంది విండోస్ వినియోగదారులు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) ఎర్రర్‌ను వచ్చింది.

అయితే క్రౌడ్‌ స్ట్రయిక్‌ సంస్థ ఇచ్చిన అప్‌డేట్‌ కారణంగానే బ్లూ స్క్రీన్‌ ఎర్రర్‌ వచ్చిందని మైక్రోసాఫ్ట్‌ సంస్థ తెలిపింది.

సేఫ్‌ లేదా రికవరీ మోడ్‌లో ఓపెన్‌ చేయాలని మైక్రోసాఫ్ట్‌ సూచించింది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోయిన వారి కోసం అప్‌డేట్‌ రిలీజ్‌ చేసింది. క్రౌడ్‌ స్ట్రయిక్‌ అనేది సైబర్‌ సెక్యూరిటీ సంస్థ అని పేర్కొంది. అయితే సమస్యను ఎలా పరిష్కరించాలతో మైక్రోసాఫ్ట్‌ సూచించింది.

ఈ పద్ధతిని అనురించాలని తెలిపిన మైక్రోసాఫ్ట్:

  • వినియోగదారులు ముందుగా విండోస్‌ను సేఫ్ మోడ్ లేదా విండోస్ రికవరీ ఎన్విరాన్‌మెంట్‌లో బూట్ చేయాలి.
  • దీని తర్వాత వారు C:\Windows\System32\drivers\CrowdStrike డైరెక్టరీకి వెళ్లాలి.
  • దీని తర్వాత వారు C-00000291*.sys ఫైల్‌ను కనుగొని దానిని తొలగించాలి.
  • చివరగా, మీరు మీ సిస్టమ్‌ను సాధారణంగా పునఃప్రారంభించవలసి ఉంటుంది.


మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి