AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

prime day: ప్రైమ్‌డే సేల్‌లో కళ్లు చెదిరే ఆఫర్స్‌.. ఈ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌..

ఈ సేల్‌లో భాగంగా పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్స్‌ లభించయనున్నాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులకు చెందిన డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేసే 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్స్‌ లభిస్తోంది. వీటికి అదనంగా అమెజాన్‌ కొన్ని ఆఫర్లను అందిస్తోంది. ఇందులో భాగంగా పలు స్మార్ట్‌ ఫోన్‌లు తక్కువ ధరకే లభిస్తున్నాయి...

prime day: ప్రైమ్‌డే సేల్‌లో కళ్లు చెదిరే ఆఫర్స్‌.. ఈ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌..
Amazon Prime Day
Narender Vaitla
|

Updated on: Jul 19, 2024 | 7:33 PM

Share

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ పేరుతో ఆఫర్స్‌ అందించనున్న విషయం తెలిసిందే. కేవలం ప్రైమ్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వస్తున్న ఈ సేల్ జులై 20,21వ తేదీల్లో అందుబాటులోకి రానుంది. అయితే ఈ ఎక్స్‌క్లూజివ్‌ సేల్‌ శుక్రవారం అర్ధరాత్రి నుంచే అందుబాటులోకి రానుంది. ఈ సేల్‌లో భాగంగా పలు రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ మొదలు, అన్ని రకాల గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సేల్‌లో భాగంగా కొన్ని స్మార్ట్‌ ఫోన్‌లు అమ్మకానికి రానున్నాయి.

ఈ సేల్‌లో భాగంగా పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్స్‌ లభించయనున్నాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులకు చెందిన డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేసే 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్స్‌ లభిస్తోంది. వీటికి అదనంగా అమెజాన్‌ కొన్ని ఆఫర్లను అందిస్తోంది. ఇందులో భాగంగా పలు స్మార్ట్‌ ఫోన్‌లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. ప్రైమ్‌ డే సేల్‌లో భాగంగా పలు స్మార్ట్‌ ఫోన్స్‌పై లభిస్తోన్న బెస్ట్‌ డీల్స్‌ కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఐఫోన్‌ 13పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఓఎల్‌ఈడీ స్క్రీన్‌, యాపిల్‌ బయోనిక్‌ ఏ15 చిప్‌తో ఉన్న ఈ ఫోన్‌ ప్రస్తుత ధర రూ. 52 వేలు ఉండగా. సేల్‌లో భాగంగా రూ. 48,799కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. బ్యాంక్‌ ఆఫర్‌లో భాగంగా అదనంగా మరో వెయ్యి రూపాయాలు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 47,799కి పొందొచ్చు. ఇదిలా ఉంటే అమెజాన్‌ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్‌ నార్డ్‌4, శాంసంగ్‌ ఎం35, మోటోరొలా రేజర్‌ 50 అల్ట్రా, హానర్‌ 200 సిరీస్‌, లావా బ్లేజ్‌ ఎక్స్‌ 5జీ ఫోన్స్‌ తొలిసారి సేల్‌ ప్రారంభంకానున్నాయి.

అమెజాన్‌ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్‌ బ్రాండ్‌కి చెందిన వన్‌ప్లస్‌ 12 ఫోన్‌ పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ ఫోన్‌ అసలు ధర రూ.64,999 కాగా.. సేల్‌లో భాగంగా బ్యాంక్‌ ఆఫర్‌తో కలుపుకొని రూ.52,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎస్‌23 అల్ట్రా ఫోన్‌ ధర రూ.74,999, ఐకూ నియో 9 ప్రో ధర రూ. 29,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ4 రూ.21,999, రెడ్‌మీ 13సి రూ.9499కే సొంతం చేసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!