Xiaami తన బడ్జెట్ ఫ్రెండ్లీ Mi LED TV 4C 32-inch టీవీని భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది ఆండ్రాయిడ్ హెచ్‌డీ రెడీ స్మార్ట్ టీవీ. ఇతర ఎంఐ టీవీలతో పోలిస్తే మందమైన బెజెల్స్ కలిగి ఉండి క్విక్ వేక్ ఫీచర్‌తో టీవీ ఐదు సెకన్లలోపు ఆన్ అవ్వడం దీని ప్రత్యేకత. ఈ కొత్త స్మార్ట్ టీవీ తగినంత కనెక్టివిటీ ఎంపికలను అందిస్తుంది. క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో వన్ జీబీ ర్యామ్ కలిగి ఉంది. భారత్‌లో ఎంఐ ఎల్‌ఈడీ టీవీ 4సీ 32 అంగుళాల, ఓన్లీ బ్లాక్, టీవీ ధర రూ. 15,999. ఈసీ ఈఎంఐ, హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ కార్డులతో రూ. వెయ్యి వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఆగస్ట్ 5న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎంఐ ఇండియా వెబ్‌సైట్‌లో ఈ మోడల్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. గతంలో ఎంఐ టీవీ 4సీ ప్రో 2018లో విడుదలైంది. ప్రస్తుతం దాని ధర రూ. 16,999
Mi LED TV 4C 32 ప్రత్యేకతలు..
– 32-అంగుళాల HD- రెడీ (1,366×768 పిక్సెల్స్) డిస్‌ప్లే
– 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 178 డిగ్రీ వ్యూయింగ్ యాంగిల్, 8ms రెస్పాన్స్ టైం
– ఆండ్రాయిడ్ టీవీ ఆధారిత ప్యాచ్‌వాల్ ఇంటర్‌ఫేస్
– ఎంఐ క్విక్ వేక్ ఫీచర్‌తో ఐదు సెకన్లలోపు టీవీని ఆన్ చేయవచ్చు.
– ఇన్‌బిల్ట్ క్రోంకాస్ట్, గూగుల్ అసిస్టెంట్
– 64-బిట్ అమ్లాజిక్ కార్టెక్స్ A53 క్వాడ్-కోర్ ప్రాసెసర్
– మాలి 450 ఎంపీ3 జీపీయూ, వన్ జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, బ్లూటూత్ v4.2, Wi-Fi, మూడు హెచ్డీఎంఐ పోర్టులు. వీటిలో ఒకటి ఏఆర్సీ, రెండు యూఎస్బీ 2.0 పోర్టులు, AV పోర్ట్, ఈథర్‌నెట్ పోర్ట్, ఒకటి ఇయర్‌ఫోన్‌ని సపోర్ట్ చేస్తుంది.