Meta: చిన్నారుల కోసం కీలక నిర్ణయం.. ఇకపై ఇన్‌స్టా, ఎఫ్‌బీలో ఆ కంటెంట్ కనిపించదు

|

Jan 11, 2024 | 5:06 PM

చిన్నారులకు తెలియకుండానే అడల్ట్ కంటెంట్‌ను చూసే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి కంటెంట్‌కు చెక్‌ పెట్టేందుకు మెటా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లో సెన్సిటివ్‌ కంటెంట్‌ను చిన్నారులు చూడకుండా రక్షించడానికి కొన్ని టూల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలిపారు. మెటా ప్లాట్‌ఫారమ్‌లలో చిన్నారులు ఏదైనా సెన్సిటివ్‌..

Meta: చిన్నారుల కోసం కీలక నిర్ణయం.. ఇకపై ఇన్‌స్టా, ఎఫ్‌బీలో ఆ కంటెంట్ కనిపించదు
Follow us on

సోషల్‌ మీడియా వినియోగం ఓ రేంజ్‌లో పెరిగింది. మారుతోన్న కాలానికి అనుగుణంగా సోషల్‌ మీడియాలో సైట్స్‌లో ఫీచర్స్‌ మారుతూ, యూజర్లను మరింత ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే చిన్నారులు సైతం సోషల్‌ మీడియాకు అలవాటు పడుతున్నారు. గంటలసేపు స్మార్ట్ ఫోన్‌తో గడిపేస్తున్నారు. అయితే ఇదే సమయంలో అశ్లీల కంటెంట్‌ పెద్ద సమస్యగా మారిపోయింది.

చిన్నారులకు తెలియకుండానే అడల్ట్ కంటెంట్‌ను చూసే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి కంటెంట్‌కు చెక్‌ పెట్టేందుకు మెటా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లో సెన్సిటివ్‌ కంటెంట్‌ను చిన్నారులు చూడకుండా రక్షించడానికి కొన్ని టూల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలిపారు. మెటా ప్లాట్‌ఫారమ్‌లలో చిన్నారులు ఏదైనా సెన్సిటివ్‌ కంటెంట్‌ కోసం సెర్చ్‌ చేస్తే, అలాంటి వాటికి బదులుగా.. ఈ సబ్జెక్ట్‌లో సహాయం కోరమని మెసేజ్‌ వస్తుంది.

‘సీ లెస్‌ సెన్సిటివ్‌ కంట్‌’ అనే ఆప్షన్‌ను టర్న్‌ ఆన్‌ చేసుకోవడం ద్వారా చిన్నారులకు కంటెంట్‌ను కంట్రోల్‌ చేయొచ్చు. ముఖ్యంగా రీల్స్‌, ఎక్స్‌ప్లోర్‌, సూసైడ్‌, సెల్ఫ హార్మ్‌ వంటి వాటికి సంబంధించిన కంటెంట్‌ను చిన్నారుల వయసు ప్రకారం చూపిస్తామని మెటా తెలిపింది. ఇప్పటికే మెటాకు చెందిన సోషల్‌ మీడియా యాప్స్‌ ప్రజలకు ఆకర్షించేందుకు రకరకాల కంటెంట్‌ను చూపిస్తున్నాయని, వాటివల్ల దుష్ప్రభావం పడుతుందని యూరప్‌, యూఎస్‌ ప్రభుత్వాల నుంచి ఒత్తిడి ఎదుర్కుంటోంది. మెటా యాప్‌లు పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఈయూ తెలిపింది.
గత ఏడాది అక్టోబర్‌లో, కాలిఫోర్నియా, న్యూయార్క్‌తో సహా 33 అమెరికా రాష్ట్రాలకు చెందిన అటార్నీ జనరల్‌లు కంపెనీపై దావా వేశారు.మెటా కంటెంట్‌కు సంబంధించి పలు దేశాల ప్రభుత్వాల నుంచి నిరంతరం ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

ఇందులో భాగంగానే ఈ కొత్త టూల్స్‌ను మెటా ప్రవేశపెట్టింది. సెన్సిటివ్‌ కంటెంట్‌కు సంబంధించి చిన్నారులు సెర్చ్‌ చేస్తే వెంటనే.. హెల్ప్‌ ఈజ్‌ అవలేబుల్‌ అనే మెసేజ్‌ చూపిస్తుంది. ఇందులో కాంటాక్ట్ ఏ హెల్ప్‌లైన్‌, రీచ్‌ అవుట్‌ ఏ ఫ్రెండ్‌ వంటి ఆప్షన్స్‌ను చూపిస్తాయి. అలాగే మెటా తీసుకొచ్చిన కొత్త సెక్యూరిటీ టూల్స్‌ ద్వారా.. కంటెంట్‌ను ఎవరు రీపోస్ట్ చేయొచ్చు, ట్యాగ్ చేయొచ్చు వంటి అంశాలను కంట్రోల్‌ చేయొచ్చు. అలాగే కేవలం తమను ఫాలో అవుతున్న వారే మెసేజ్‌లను పంపేలా సెట్‌ చేసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..