Whatsapp: మరో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌తో రానున్న వాట్సాప్‌.. ఇకపై గ్రూప్స్‌లో ఆ అవకాశం..

|

Mar 11, 2022 | 5:39 PM

Whatsapp: వాట్సాప్‌ మెసేజింగ్ యాప్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. యూజర్ల అవరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను (Whatsapp Feature) తీసుకొస్తుంది. అందుకే ఎన్ని రకాల మెసేజింగ్‌ యాప్స్‌...

Whatsapp: మరో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌తో రానున్న వాట్సాప్‌.. ఇకపై గ్రూప్స్‌లో ఆ అవకాశం..
Whatsapp New Feature
Follow us on

Whatsapp: వాట్సాప్‌ మెసేజింగ్ యాప్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. యూజర్ల అవరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను (Whatsapp Feature) తీసుకొస్తుంది. అందుకే ఎన్ని రకాల మెసేజింగ్‌ యాప్స్‌ వచ్చినా వాట్సాప్‌ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గడం లేదు. యూజర్‌ ఫ్రెండ్లీగా ఉండడం, అన్ని రకాల ఫీచర్లు అందుబాటులో ఉండడంతో వాట్సాప్‌ను ఎక్కువ మంది ఉపయోగిస్తుంటారు. చివరికి యూపీఐ పేమెంట్స్‌ (UPI Payments) కూడా వాట్సాప్‌ ద్వారానే చేసుకునే అవకాశం ఉండడం.. వాట్సాప్‌ క్రేజ్‌ తగ్గకపోవడానికి ఓ కారణంగా చెప్పవచ్చు. ఇలా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్న వాట్సాప్‌ తాజాగా యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది.

వాట్సాప్‌ త్వరలోనే తన యూజర్ల కోసం గ్రూప్‌ చాట్‌లలో పోల్స్‌ ఫీచర్‌ను తీసుకువస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి వాట్సాప్‌ బీటా ఇన్ఫో స్క్రీన్‌ షాట్స్‌ను విడుదల చేసింది. ఇంతకీ ఈ గ్రూప్‌ పోల్స్‌ ఫీచర్‌ ఎంటీ.? దాంతో కలిగే ప్రయోజనాలు ఏంటనేగా మీ సందేహం.

 

ఈ ఫీచర్‌ సహాయంతో ఏదైనా ప్రశ్నకు సంబంధించి వాట్సాప్‌లో పోల్‌ను క్రియేట్‌ చేయొచ్చు. సదరు ప్రశ్నకు గ్రూప్‌లోని యూజర్లు ఓటు వేసే వెసులుబాటును కల్పిస్తారు. గ్రూప్‌లో ఉన్న సభ్యులు మాత్రమే ఈ పోల్స్‌ను, వాటి ఫలితాలను చూడగలుగుతారు. ఇదిలా ఉంటే ఈ ఫీచర్‌ ఇప్పటికే టెలిగ్రామ్‌, ఫేస్‌బుక్‌ మెసేంజర్‌లో అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సాప్‌లో కూడా ప్రవేశ పెట్టే దిశగా ఈ మెసేజింగ్ యాప్‌ ప్రయత్నాలు మొదలు పెట్టింది.

Also Read: AAP: చిన్న ప్రాంతీయ పార్టీగా మొదలై.. నేడు జాతీయ పార్టీలనే ఊడ్చేస్తోంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ సక్సెస్‌ జర్నీ..

Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే మీ డైట్‌లో ఇది తప్పనిసరిగా ఉండాల్సిందే..

Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే మీ డైట్‌లో ఇది తప్పనిసరిగా ఉండాల్సిందే..