Mahindra EV Cars: మార్కెట్ లోకి మహీంద్రా కొత్త ఈవీ కార్స్.. త్వరలోనే హైదరాబాద్ లో ప్రదర్శన..

|

Feb 05, 2023 | 2:59 PM

భారత్ లో ఉన్న పెరుగుతున్న ఇంధన ధరలకు ప్రత్యామ్నాయంగా ఈవీ వెహికల్స్ వైపు వి నియోగదారులు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత్ ఓ ఎలక్ట్రిక్ కార్ రిలీజ్ చేసిన మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ త్వరలో మరికొన్ని కొత్త మోడల్స్ రిలీజ్ చేస్తామని చెబుతుంది.

Mahindra EV Cars: మార్కెట్ లోకి మహీంద్రా కొత్త ఈవీ కార్స్.. త్వరలోనే హైదరాబాద్ లో ప్రదర్శన..
Mahindra Xuv
Follow us on

ప్రస్తుతం ఆటో మొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారులు కూడా ఆసక్తి కనబరుస్తుండడంతో టాప్ కంపెనీలు కూడా తమ కొత్త ఈవీ వాహనాలను మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నాయి. అలాగే భారత్ లో ఉన్న పెరుగుతున్న ఇంధన ధరలకు ప్రత్యామ్నాయంగా ఈవీ వెహికల్స్ వైపు వి నియోగదారులు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత్ ఓ ఎలక్ట్రిక్ కార్ రిలీజ్ చేసిన మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ త్వరలో మరికొన్ని కొత్త మోడల్స్ రిలీజ్ చేస్తామని చెబుతుంది. తమ కొత్త తరం ఎస్ యూవీల ను భారత్ లో ప్రదర్శిస్తామని ఇటీవల ట్వీట్ చేసింది. ఆ వివరాలేంటో ఓ సారి చూద్దాం.

ఫిబ్రవరి 10న హైదరాబాద్ లోనే

కంపెనీ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 10 న హైదరాబాద్ లో నిర్వహించే మహీంద్రా ఈవీ ఫ్యాషన్ ఫెస్టివల్ లో కంపెనీ నూతన ఈవీ మోడల్స్ ను ప్రదర్శిస్తుంది. భవిష్యత్ ఇప్పుడే ప్రారంభవుతుంది. ‘మా కొత్త ఎస్ యూవీల గ్రాండ్ హోమ్ కమింగ్ కోసం వేచి ఉండండి’ అంటూ మహీంద్రా కంపెనీ ఇటీవల ట్వీట్టర్ లో పేర్కొంది. ఎలక్ట్రిక్ ఎస్ యూవీలను తయారు చేసే రెండు బ్రాండ్స్ లో కొత్త బోర్న్ ఎలక్ట్రిక్, మరో ఎక్స్ యూవీ కార్ భారత్ ప్రదర్శిస్తారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ కార్లు గతేడాది ఆగస్టులో యూకే లోని ఆక్స్ ఫర్డ్ షైర్ లో ప్రదర్శించారు. 

మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్ యూవీలు ఇవే

యూకే లో మహీంద్రా ఐదు ఎలక్ట్రిక్ ఎస్ యూవీలను వెల్లడించింది. ఎక్స్ యూవీ ఈ8, ఎక్స్ యూవీ ఈ9, బీఈ 05, బీఈ07, బీఈ08 లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎక్స్ యూవీ ఈ8, ఈ9, బీఈ 05, 07 కార్లు 2024 నుంచి 2026 మధ్య భారత్ మార్కెట్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ మోడ్సల్ అన్ని ఇంగ్లో ఈవీ ఫ్లాట్ ఫామ్స్ పై ఆధారపడి పని చేస్తాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..