5G Phones: రూ. 10 వేలలో 5జీ ఫోన్స్‌.. ఫీచర్ల విషయంలో తగ్గేదేలే..

|

Mar 18, 2024 | 3:31 PM

దేశవ్యాప్తంగా 5జీ సేవలు విస్తరిస్తున్నాయి. చిన్న చిన్న పట్టణాల్లోనూ 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో స్మార్ట్ ఫోన్‌ యూజర్లు సైతం 5జీ ఫోన్‌లకు అప్‌గ్రేడ్‌ అవుతున్నారు. 4జీ ఫోన్‌లను పక్కన పెట్టేసి ఫాస్ట్‌ నెట్‌వర్క్‌ కోసం 5జీ ఫోన్‌లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ప్రారభంలో భారీ ధర పలికిన 5జీ ఫోన్‌లు ఇప్పుడు..

5G Phones: రూ. 10 వేలలో 5జీ ఫోన్స్‌.. ఫీచర్ల విషయంలో తగ్గేదేలే..
5g Phones
Follow us on

దేశవ్యాప్తంగా 5జీ సేవలు విస్తరిస్తున్నాయి. చిన్న చిన్న పట్టణాల్లోనూ 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో స్మార్ట్ ఫోన్‌ యూజర్లు సైతం 5జీ ఫోన్‌లకు అప్‌గ్రేడ్‌ అవుతున్నారు. 4జీ ఫోన్‌లను పక్కన పెట్టేసి ఫాస్ట్‌ నెట్‌వర్క్‌ కోసం 5జీ ఫోన్‌లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ప్రారభంలో భారీ ధర పలికిన 5జీ ఫోన్‌లు ఇప్పుడు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. కంపెనీల మధ్య పెరిగిన పోటీ నేపథ్యంలో 5జీ ఫోన్‌లు చాలా తక్కువ ధరకే అందుబాటులోకి వస్తున్నాయి. మరి మీరు కూడా 5జీ ఫోన్‌కు ఫిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారా.? అయితే రూ. 10 వేలలోపు అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్‌ స్మార్ట్ ఫోన్‌లు ఏంటి.? వాటిలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..

Poco M65g: ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌ ప్రారంభ వేరియంట్‌ ధర రూ. 10,4999గా ఉంది. బ్యాంక్‌ ఆఫర్లను కలుపుకుంటే ఈ ఫోన్‌ను రూ. 10వేలలోపే సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.74 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇచ్చారు. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్ రేట్‌తో పాటు గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌ వంటి ఫీచర్లను అందించారు. ఈ ఫోన్‌ను 4జీబీ ర్యామ్‌, 6 జీబీ ర్యామ్‌, 8 జీబీ ర్యామ్‌తో పాటు 128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో తీసుకొచ్చారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను, 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం.

Lava Blaze2 5G: రూ. 10వేలలో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ 5జీ ఫోన్‌ లావా బ్లేజ్‌2 ఒకటి. ఈ ఫోన్‌ ధర రూ. 9,999గా ఉంది. ఇందులో 6.56 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 2.5డీ కర్వ్‌డ్‌ స్క్రీన్ ఈ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. 90 హెచ్‌జెడ్ ఈ స్క్రీన్‌ సొంతం. మీడియాటెక్‌ డైమెన్సిటీ డీ6020ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 18 వాట్స్‌ ఛాఫ్ట్‌ చార్జర్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీని ఇందులో ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే 50 మెగాపిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

MotoG34: తక్కువ ధరలో మంచి 5జీ ఫోన్‌లలో మోటో జీ34 మొదటి స్థానంలో ఉంటుంది. ఈ ఫోన్‌ ధర రూ. 10,999గా ఉంది. బ్యాంక్‌ ఆఫర్‌లో భాగంగా రూ. వెయ్యి వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో బ్యాక్‌ ప్యానల్‌ను లెధర్‌ ఫినిష్‌తో ఇచ్చారు. దీంతో ఫోన్‌కు రిచ్‌ లుక్‌ వచ్చింది. ఇక ఈ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌తో హెడ్‌డీ+ డిస్‌ప్లేను ఇచ్చారు. అలాగే 500 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం. ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇచ్చారు. అలాగే సెల్ఫీలు వీడియో కాల్స్‌ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

Poco M6 pro: రూ. 10 వేలలో అందుబాటులో ఉన్న బెస్ట్ 5జీ ఫోన్‌లలో పోకో ఎమ్‌6 ప్రో ఒకటి. ఈ ఫోన్‌ ధర రూ. 9,999గా ఉంది. ఇందులో 6.79 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 50 మెగాపిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్స్‌ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. 18 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..