
Smart TV Safety Tips: నేటి కాలంలో ప్రతి ఇంట్లో స్మార్ట్ టీవీ ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. వేల నుండి లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసే ఈ టీవీల విషయంలో మనం చేసే ఒక చిన్న పొరపాటు భారీ నష్టానికి దారితీస్తుంది. ముఖ్యంగా టీవీ దగ్గర దోమలను కొట్టే ఎలక్ట్రిక్ బ్యాట్ వాడటం వల్ల మీ టీవీ శాశ్వతంగా పాడయ్యే అవకాశం ఉందని ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం LG తన వినియోగదారులను హెచ్చరించింది.
LG తన స్మార్ట్ టీవీల అధికారిక యూజర్ మ్యాన్యువల్‌లో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. టీవీకి సమీపంలో హై-వోల్టేజ్ ఎలక్ట్రికల్ పరికరాలను వాడకూడదని కంపెనీ తెలిపింది. దీనికి ఉదాహరణగా దోమల బ్యాట్‌ను పేర్కొంది. ఈ పరికరాల వల్ల ఉత్పన్నమయ్యే హై-వోల్టేజ్ స్పార్క్ (Spark) కారణంగా టీవీ లోపల ఉండే సెన్సిటివ్ సర్క్యూట్లు దెబ్బతినే ప్రమాదం ఉందని కంపెనీ వివరించింది.
దోమల బ్యాట్ చూడటానికి చిన్నదిగా అనిపించినా, అది పని చేసేటప్పుడు చాలా ఎక్కువ వోల్టేజ్ కరెంట్‌ను విడుదల చేస్తుంది.
సాధారణంగా టీవీ ఆన్‌లో ఉన్నప్పుడు దాని చుట్టూ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ నిరంతరం ప్రసరిస్తూ ఉంటాయి. ఒకవేళ దోమ టీవీ స్క్రీన్‌పై కూర్చున్నప్పుడు మీరు దానిని బ్యాట్‌తో కొట్టడానికి ప్రయత్నిస్తే, ఆ స్పార్క్ ప్రభావం నేరుగా డిస్‌ప్లేపై పడుతుంది. గాలి ద్వారా వ్యాపించే ఈ విద్యుత్ తరంగాలు కూడా టీవీ లోపలి భాగాలను దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే టీవీకి కనీసం 2 నుండి 3 అడుగుల దూరంలో ఇటువంటి పరికరాలను వాడాలని వారు సూచిస్తున్నారు.
మీ ఖరీదైన స్మార్ట్ టీవీ సురక్షితంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి:
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. మీరు చేసిన పొరపాటు వల్ల టీవీ పాడైతే అది ‘యూజర్ నిర్లక్ష్యం’ కిందికి వస్తుంది కాబట్టి కంపెనీలు వారంటీ కూడా ఇవ్వకపోవచ్చు. అందుకే జాగ్రత్త వహించండి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి