
రాత్రంతా ఫోన్ ఛార్జింగ్‌లో ఉంచితే బ్యాటరీ పాడైపోతుందనే భయం చాలా మందిలో ఉంటుంది. కానీ నిజానికి ఆధునిక స్మార్ట్‌ఫోన్‌లలో ఇప్పటికే బ్యాటరీ రక్షణకు అనేక స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ సమస్యను మరింత సులభంగా పరిష్కరించేందుకు చైనాకు చెందిన Kuajia కంపెనీ ఒక వినూత్న ఆటో-ఎజెక్ట్ మొబైల్ ఛార్జర్‌ను తీసుకొచ్చింది. ఈ ఛార్జర్ ప్రత్యేకత ఏమిటంటే ఫోన్ బ్యాటరీ 100 శాతం చేరుకున్న వెంటనే అది స్వయంగా ప్లగ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. దీని కోసం ఛార్జర్‌లో సెన్సార్లు, విద్యుదయస్కాంత లాక్, స్ప్రింగ్ మెకానిజం ఉపయోగించారు.
బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయినట్లు సెన్సార్ గుర్తిస్తే, విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. వెంటనే స్ప్రింగ్ సహాయంతో ఛార్జర్ సాకెట్ నుంచి బయటకు నెట్టబడుతుంది. ఇలాంటి టెక్నాలజీ వల్ల ఛార్జర్ ఎక్కువసేపు ప్లగ్‌లో ఉండి వేడెక్కడం, ఫోన్ లేదా అడాప్టర్ దెబ్బతినే ప్రమాదం తగ్గుతుంది. ముఖ్యంగా రాత్రివేళలు ఛార్జింగ్ పెట్టి మర్చిపోయే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
అయితే శాంసంగ్, యాపిల్, షావోమీ, వన్‌ప్లస్ వంటి ప్రముఖ కంపెనీల ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఇప్పటికే ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి బ్యాటరీ 80–100 శాతం మధ్యలో పవర్ ఫ్లోను నియంత్రించి, వేడెక్కకుండా కాపాడుతాయి. అందువల్ల ఓవర్‌ఛార్జింగ్ వల్ల ఫోన్ దెబ్బతినే ప్రమాదం చాలా వరకు తగ్గిపోయింది. కానీ సాధారణ లేదా పాత మోడల్ ఫోన్లు ఉపయోగించే వారికి ఈ ఆటో-ఎజెక్ట్ ఛార్జర్ మంచి పరిష్కారం కావచ్చు. ప్రస్తుతం ఈ ఛార్జర్ ధర విదేశాల్లో సుమారు రూ.750 వరకు ఉంది. భారత మార్కెట్‌లోకి వచ్చినప్పుడు ధర కొంత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.
Auto cut on full charge! 👀
useful or waste of money ? pic.twitter.com/LgRwxDvCFB
— Abhishek Bhatnagar (@abhishek) April 17, 2026
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి