చంద్రుడి ఉపరితలం ఫొటోలు పంపించిన చంద్రయాన్‌ 3.. జాబిల్లి దగ్గరి నుంచి ఎలా ఉందో చూడండి.

|

Aug 18, 2023 | 5:27 PM

చంద్రుడిపై ఉపరితలంపై ఉన్న బిలాలు ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ల్యాండర్‌ మాడ్యూల్ క్రమంగా చంద్రుడికి దగ్గరగా చేరుకుంటుంది. ల్యాండర్‌ వేగాన్ని తగ్గించే ప్రక్రియ విజయవంతమైనట్లు ఇస్రో తెలిపింది. ల్యాండర్‌, రోవర్‌ రెండు ప్రస్తుతం సరిగ్గా పనిచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రెండో బూస్టింగ్ ప్రక్రియను ఆగస్టు 20న తెల్లవారుజామున 2 గంటలకు చేపట్టనున్నారు. దీని తర్వాత ల్యాండర్‌ చంద్రుడికి...

చంద్రుడి మీద పరిశోధనల కోసం ప్రయోగించిన చంద్రయాన్‌ 3 క్రమంగా లక్ష్యం వైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో సొంతంగా తిరుగుతున్న ల్యాండర్‌ విక్రమ్‌ చంద్రుడి ఉపరితలం ఫొటోలను తీసి భూమిపైకి పంపించింది. చంద్రయాన్‌ -3 ప్రొపల్షన్‌ మాడ్యూల్ నుంచి విడిపోయిన కొద్ది సేపటికే ల్యాండర్‌ ఈ ఫొటోలను తీసినట్లు ఇస్రో తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇస్రో ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. చంద్రుడిపై ఉపరితలంపై ఉన్న బిలాలు ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ల్యాండర్‌ మాడ్యూల్ క్రమంగా చంద్రుడికి దగ్గరగా చేరుకుంటుంది. ల్యాండర్‌ వేగాన్ని తగ్గించే ప్రక్రియ విజయవంతమైనట్లు ఇస్రో తెలిపింది. ల్యాండర్‌, రోవర్‌ రెండు ప్రస్తుతం సరిగ్గా పనిచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రెండో బూస్టింగ్ ప్రక్రియను ఆగస్టు 20న తెల్లవారుజామున 2 గంటలకు చేపట్టనున్నారు. దీని తర్వాత ల్యాండర్‌ చంద్రుడికి మరింత చేరు కానుంది. ఇక చివరిగా ఆగస్టు 23వ తేదీన సాయంత్రం దక్షిణ ధృవంపై ల్యాండర్‌ ల్యాండ్‌ కానుంది.