Aditya-L1 Mission: సక్సెస్‌ దిశగా ఆదిత్య ఎల్‌-1.. భూమికి 9.2 లక్షల కి.మీ దూరంలోకి చేరుకుందన్న ఇస్రో..

|

Oct 01, 2023 | 7:14 PM

Aditya-L1 Solar Mission: అమెరికా, జపాన్, యూరప్, చైనా మాత్రమే సూర్యుడిపై అధ్యయనానికి ఉపగ్రహాన్ని పంపాయి. వాటి తర్వాత సూర్యుడిపైకి ఉపగ్రహాన్ని పంపిన ఐదో దేశంగా భారత్ నిలిచింది. సెప్టెంబరు 2న సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుంచి ఇస్రో ప్రయోగించిన ఆదిత్య-ఎల్1.. 125 రోజులు ప్రయాణం తర్వాత 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడి లాగ్రాంజ్ పాయింట్‌కు చేరుతుంది. ప్రయోగం తర్వాత 16 రోజుల పాటు భూకక్ష్యలో ఉన్న ఈ ఉపగ్రహం.. ఐదు దశల్లో కక్ష్య పెంపు విన్యాసాన్ని నిర్వహించిన..

Aditya-L1 Mission: సక్సెస్‌ దిశగా ఆదిత్య ఎల్‌-1.. భూమికి 9.2 లక్షల కి.మీ దూరంలోకి చేరుకుందన్న ఇస్రో..
Aditya L1
Follow us on

సూర్యుడి గుట్టు విప్పేందుకు ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 సక్సెస్‌ దిశగా పయనిస్తోంది. ఇస్రో కీలక ప్రకటన చేసింది. భూమి గురుత్వాకర్షణ పరిధి నుంచి విజయవంతంగా బయటకు వెళ్లిందని వెల్లడించింది. ఆదిత్య ఎల్1 సూర్యుడి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనాలను అధ్యయనం చేయనుంది. సౌర జ్వాలలు, సౌర రేణువులు, అక్కడి వాతావరణం గురించి ఎన్నో అంశాలను శోధిస్తుంది. లాగ్రాంజ్‌ పాయింట్‌ 1 నుంచి ఈ ఉపగ్రహం సూర్యుడ్ని డేగ కళ్లతో ఐదేళ్ల పాటు అధ్యయనం చేస్తుంది. ఇందులోని మొత్తం ఏడు పేలోడ్లను స్వదేశీయంగా అభివృద్ధి చేశారు.ఇందులోని 5 పేలోడ్లను ఇస్రోతోపాటు విద్యా సంస్థల సహకారంతో రూపొందించారు.

ఇప్పటి వరకూ అమెరికా, జపాన్, యూరప్, చైనా మాత్రమే సూర్యుడిపై అధ్యయనానికి ఉపగ్రహాన్ని పంపాయి.అయితే సూర్యుడిపైకి ఉపగ్రహాన్ని పంపిన 5వ దేశంగా భారత్ రికార్డు క్రియేట్ చేసింది.సెప్టెంబర్ నెల 2న సతీష్ ధవన్ స్పెస్ సెంటర్ నుంచి ఇస్ట్రో ప్రయోగించిన ఆదిత్య-ఎల్1.. 125 రోజులు ప్రయాణం తర్వాత 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడి లాగ్రాంజ్ పాయింట్‌కు చేరుతుంది. ప్రయోగం తర్వాత 16 రోజుల పాటు భూకక్ష్యలో ఉన్న ఈ ఉపగ్రహం.. ఐదు దశల్లో కక్ష్య పెంపు విన్యాసాన్ని నిర్వహించిన తర్వాత నిర్దేశిత లాగ్రాంజ్ పాయింట్ 1 వైపు సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించి కీలక మైలురాయిని దాటింది.

లక్ష్యం దిశగా దూసుకుపోతూ..

సూర్యుని రహస్యాలను కనుగొనేందుకు ఇస్రో తొలిసారి ప్రయోగించిన ఆదిత్య ఎల్-1పై కీలక ప్రకటన వెలువడింది. ఆదిత్య ఎల్ -1 ఉపగ్రహం లక్ష్యం దిశగా దూసుకుపోతోంది.  భూమి నుంచి 9లక్షల 20 వేల కిలోమీటర్లను వ్యోమనౌక దాటినట్లు ఇస్రో తాజాగా ప్రకటించింది. భూమి గురుత్వాకర్షణ పరిధి నుంచి విజయవంతంగా బయటపడినట్లు వెల్లడించింది. ఇలా గురుత్వాకర్షణ శక్తి దాటుకుని వెళ్లిన వ్యోమనౌక ఇదే. గతంలో అంగారకుడిపై పరిశోధనలకు ఇస్రో ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్‌‌ తొలిసారి భూ గురుత్వాకర్షణ ప్రభావం దాటి పయనించింది.

లాగ్రాంజ్‌ పాయింట్‌ 1 పాయింట్‌కు..

మరో 6 లక్షల కి.మీ. ప్రయాణిస్తే వ్యోమనౌక విజయవంతంగా లాగ్రాంజ్‌ పాయింట్‌ 1 పాయింట్‌కు చేరినట్లేనని ఇస్రో వెల్లడించింది. లాగ్రాంజ్ పాయింట్లు అంతరిక్షంలో ప్రత్యేకమైన ప్రదేశాలు. స్పేస్ క్రాఫ్ట్ తిరగడానికి అనుకూలమైన ప్రదేశం. ఇక్కడ ఇంధనం చాలా తక్కువ ఖర్చవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ ‘స్నేహితులు’ ఆదిత్య L1తో

ఆదిత్య L1 మిషన్ భూమి-సూర్యుడు యొక్క L1 పాయింట్ దగ్గర ‘హలో ఆర్బిట్’లో తిరుగుతుంది. భూమి నుంచి ఈ పాయింట్ దూరం దాదాపు 15 లక్షల కిలోమీటర్లు. ఈ భారతీయ మిషన్ ఉద్దేశ్యం సూర్యుని ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనాపై నిఘా ఉంచడం, తద్వారా దానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని భూమికి పంపవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి