iQOO 16 బ్యాటరీ కెపాసిటీ ఎంతో తెలిస్తే ఛార్జింగ్‌ బాధితులు ఫిదా అయిపోతారు.. ధర తక్కువేగా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO భారత మార్కెట్లో మరో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. iQOO 16 పేరుతో రానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ప్రత్యేక పేజీ తాజాగా Amazon Indiaలో కొద్దిసేపు కనిపించింది. అందులో Coming Soon అనే ట్యాగ్‌తో పాటు Powered by OriginOS 7 అనే వివరాలు దర్శనమిచ్చాయి. అయితే కొద్దిసేపటికే ఆ పేజీని తొలగించారు. ఇప్పటికే భారత్‌లో ఈ ఫోన్ లాంచ్‌ను iQOO ధృవీకరించినప్పటికీ, కచ్చితమైన విడుదల తేదీని ప్రకటించలేదు. సమాచారం ప్రకారం వచ్చే నెలలో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

iQOO 16 బ్యాటరీ కెపాసిటీ ఎంతో తెలిస్తే ఛార్జింగ్‌ బాధితులు ఫిదా అయిపోతారు.. ధర తక్కువేగా
Iqoo 16

Updated on: Nov 27, 2026 | 6:00 AM

ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనాలనుకునే వారిని ఆకట్టుకునేలా iQOO 16లో శక్తివంతమైన ప్రాసెసర్‌, భారీ బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ముఖ్యంగా 8,400mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ప్రత్యేకతలు ఈ ఫోన్‌పై ఆసక్తిని పెంచుతున్నాయి. చైనాలో విడుదలైన మోడల్ వివరాలు ప్రస్తుతం అందుబాటులో ఉండగా, భారత్‌లో వచ్చే వేరియంట్ స్పెసిఫికేషన్లు, ధరపై కంపెనీ నుంచి పూర్తి సమాచారం రావాల్సి ఉంది.

8,400mAh బ్యాటరీ

iQOO 16లో Qualcomm Snapdragon 8 Elite Extreme Gen 6 చిప్‌సెట్‌ను అందించనున్నారు. 2nm టెక్నాలజీతో రూపొందించిన ఈ ప్రాసెసర్ గరిష్ఠంగా 5.01GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది. చైనాలో సెప్టెంబర్‌లో విడుదలైన మోడల్‌లోనూ ఇదే చిప్‌సెట్‌ను ఉపయోగించారు. గ్లోబల్ వేరియంట్ Geekbenchలో 12GB RAM, Android 17 ఆపరేటింగ్ సిస్టమ్‌తో కనిపించింది.

చైనా వేరియంట్‌లో 6.85 అంగుళాల 2K AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 165Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 8,400mAh సామర్థ్యంతో పాటు 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. వెనుకవైపు మూడు 50MP కెమెరాలతో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. చైనాలో 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 5,999గా ఉంది. భారత మార్కెట్లో దీని ధరను ఇంకా ప్రకటించలేదు.

Geekbenchలో కీలక వివరాలు

మరోవైపు iQOO 16R పేరుతో భావిస్తున్న కొత్త స్మార్ట్‌ఫోన్ కూడా Geekbenchలో కనిపించింది. vivo I2606 మోడల్ నంబర్‌తో నమోదైన ఈ ఫోన్‌లో Qualcomm Snapdragon 8s Gen 4 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో ఎనిమిది కోర్లు ఉండగా, గరిష్ఠంగా 3.21GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ కోసం Adreno 825 GPUను అందించారు. ఈ డివైజ్ 12GB RAM, Android 17 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పరీక్షల్లో కనిపించింది.

Geekbench సింగిల్ కోర్ టెస్ట్‌లో 1,775 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్‌లో 6,680 పాయింట్లు సాధించింది. అయితే ఈ ఫోన్ పేరును iQOO అధికారికంగా ధృవీకరించలేదు. ఇదే మోడల్ నంబర్ గతంలో IMEI డేటాబేస్‌లో iQOO 16R పేరుతో కనిపించగా, మలేషియా SIRIM, ఇండోనేషియా SDPPI సర్టిఫికేషన్లలో iQOO 16s పేరుతో నమోదైంది. భారత్‌లో BIS సర్టిఫికేషన్ కూడా పొందింది. దీంతో ఈ ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చే అవకాశాలపై ఆసక్తి నెలకొంది.

Loading...
Unable to load recommendations.
Follow Us