
తదుపరి ఐఫోన్ లైనప్ కోసం ముఖ్యంగా ఐఫోన్ 17e కోసం ఎదురుచూస్తున్న ఆపిల్ అభిమానులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ ఇది. నెలల తరబడి పుకార్లు వ్యాపిస్తుండగా చైనీస్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ వీబో నుండి వచ్చిన కొత్త లీక్ ఈ సరసమైన మోడల్ త్వరలో భారీ ఉత్పత్తిలోకి ప్రవేశించనుందని సూచిస్తుంది. తక్కువ-ధర ఫ్లాగ్‌షిప్ పోటీదారుగా ఊహిస్తున్న ఐఫోన్ 17e డైనమిక్ ఐలాండ్‌ను కలిగి ఉంటుందని, ఐఫోన్ 16e డిజైన్‌తో నిరాశచెందిన వారికి ఇది జోస్ ఇస్తుందని టెక్ నిపుణులు కూడా భావిస్తున్నారు.
వీబోలోని టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు ప్రకారం.. జనవరి 9న లాస్ వెగాస్‌లో ముగిసే CES 2026 తర్వాత ఆపిల్ ఐఫోన్ 17e భారీ ఉత్పత్తిని వెంటనే ప్రారంభిస్తుంది. 2026 మేలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందనే టాక్ వినిపిస్తున్నప్పటికీ, ఈ ఏడాది చివర్లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి