iphone 15: యాపిల్ యూజర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. యాపిల్ కొత్త ఫోన్ ఐఫోన్ 15 సిరీస్ ఎట్టకేలకు మార్కెట్లోకి వచ్చేసింది. ఐఫోన్ 15 సిరీస్ అమ్మకాలు భారత్‌లో శుక్రవారం నుంచి మొదలయ్యాయి. ఢిల్లీతోపాటు ముంబయిలో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు అమ్మకాలు షురు అయ్యాయి. దీంతో ఐఫోన్ లవర్స్ ఉదయం నుంచే స్టోర్‌ల ముందుకు క్యూ కట్టారు.
ఇదిలా ఉంటే ఐఫోన్ 15 సిరీస్‌ను యాపిల్ సెప్టెంబర్ 12 గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ చేయగా నేటి నుంచి అమ్మకాలు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్‌లను లాంచ్ చేసింది. ఇక ధరల విషయానికొస్తే ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ. 79,900గా ఉంది. ఇక ఐఫోన్ 15 ప్లస్ రూ. 89,900, ఐఫోన్ 15 ప్రో రూ. 1,34,900గా ఉంది. ఇక ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర ఏకంగా రూ. 1,59,900గా నిర్ణయించారు. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ ఆఫర్‌ను అందిస్తోంది.
హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ద్వారా ఐఫోన్ 15 సిరీస్‌ను కొనుగోలు చేసే వారికి ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఐఫోన్ మోడల్ ఆధారంగా రూ. 5000 నుంచి రూ. 6000 వరకు డిస్కౌంట్‌ను ప్రకటించారు. ఇక పాత ఫోన్‌లను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా కూడా డిస్కౌంట్ పొందే అవకాశం కల్పించారు. వీటితో పాటు కొన్ని ఆన్‌లైన్ ఈ కామర్స్ సైట్స్ సైతం ప్రత్యేకంగా డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.
ఇక ఐఫోన్ 15 ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.1 ఇంచెస్ స్క్రీన్‌ను అందించారు. ఐఫోన్ 15 ప్లస్ విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్ స్క్రీన్ ఇచ్చారు. ఓఎల్‌ఈడీ సూపర్ రెటీనా డిస్‌ప్లే ఈ ఫోన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. 48 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఈ ఫోన్‌లో ఇచ్చారు. 2ఎక్స్ టెలిఫొటో సామర్థ్యం ఈ కెమెరా సొంతం. అలాగే 24 ఎంఎం, 28 ఎంఎం, 38 ఎంఎం లెన్స్‌ను ఇచ్చారు. ఇక ఐఫోన్ 15 సిరీస్ యూఎస్‌బీ సీ పోర్ట్‌తో రావడం గమనార్హం. ఐఓఎస్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఐఫోన్ 15 స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది.
Apple iPhone 15 Sales goes Live in India: Customers line up outside Mumbai store since 3 am.pic.twitter.com/yf2mol8fbW
— Marketing Maverick (@MarketingMvrick) September 22, 2023
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..