Data Saving Tips: స్మార్ట్‌ఫోన్‌లోని ఇంటర్నెట్ డేటా త్వరగా అయిపోతుందా..? ఈ టిప్స్ పాటిస్తే ఆ సమస్య ఉండనే ఉండదు..

|

Feb 06, 2023 | 12:51 PM

Data Save Tips: ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఏ పని జరగాలన్నా ఇంటర్నెట్ తప్పనిసరిగా మారింది. ఇంకా మానవ జీవనవిధానాన్ని అంత్యంత సులభతరం చేసిన ఈ ఇంటర్నెట్..

Data Saving Tips: స్మార్ట్‌ఫోన్‌లోని ఇంటర్నెట్ డేటా త్వరగా అయిపోతుందా..? ఈ టిప్స్ పాటిస్తే ఆ సమస్య ఉండనే ఉండదు..
Data Save Tips
Follow us on

Data Save Tips: ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఏ పని జరగాలన్నా ఇంటర్నెట్ తప్పనిసరిగా మారింది. ఇంకా మానవ జీవనవిధానాన్ని అంత్యంత సులభతరం చేసిన ఈ ఇంటర్నెట్ సేవల కారణంగానే అన్ని పనులు జరుగుతున్నాయి. GMail, WhatsApp, YouTube నుంచి UPI లావాదేవీలు, ఇతర పనులు మొత్తం కూడా స్మార్ట్‌ఫోన్‌లోని ఇంటర్నెట్ ద్వారానే జరుగుతున్నాయి. OTT ప్లాట్‌ఫారమ్‌లో సిరీస్, సినిమాలు, వినోదం వంటి వాటి కోసం కూడా ఫోన్‌లో ఇంటర్నెట్ ఉండటం అవసరం. అయితే ఈ పనులను చేస్తున్నప్పుడు మన ఇంటర్నెట్ డేటా అధిక వేగంతో అయిపోతుంది. ఇక ఇలాంటి పరిస్థితిలో అదనంగా తీసుకునే డేటా ప్యాక్‌లు ఖరీదైనవిగా మారుతున్నాయి. కారణం ఏమిటంటే మొబైల్ డేటా వినియోగానికి డిమాండ్ పెరగడమే. మరి ఈ సమస్యను అధిగమించడానికి డేటాను సేవ్ చేసేందుకు పాటించవలసిన చిట్కాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. wifi మోడ్‌లో యాప్‌లు: డేటాను సేవ్ చేయడానికి ముందుగా మొబైల్ డేటా మోడ్ నుంచి Google Playstoreలోని అన్ని యాప్‌ల అప్‌డేట్‌ను WiFi మోడ్‌లో ఉంచండి. చాలా మంది వినియోగదారులకు తమ ఫోన్ డేటా ఏ యాప్‌లో ఖర్చు అవుతుందో తెలియదు. ఈ యాప్‌లను WiFi మోడ్‌లో ఉంచితే ఇది మొబైల్ డేటాను కొంత వరకు ఆదా చేస్తుంది.
  2. డేటా లిమిట్‌ సెట్: మీ మొబైల్‌లో డేటా పరిమితిని సెట్ చేసుకోవడం ఉత్తమం. ప్రతి మొబైల్‌లో ఈ ఆప్షన్ ఉంటుంది. డేటా లిమిట్ సెట్ చేసుకోవాలంటే ముందుగా స్మార్ట్ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. తర్వాత డేటా లిమిట్‌, బిల్లింగ్ సైకిల్ ఎంపికపై క్లిక్ చేయండి. తర్వాత స్మార్ట్‌ఫోన్‌లో డేటా పరిమితిని సెట్ చేసుకోవచ్చు. మీరు 1GB డేటా పరిమితిని సెట్ చేస్తే 1GB డేటా ముగిసిన తర్వాత ఇంటర్నెట్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది.
  3. డేటా సేవర్ మోడ్‌: మీ స్మార్ట్‌ఫోన్‌లో డేటా సేవర్ మోడ్‌ను ప్రారంభించండి. ఈ ఆప్షన్ మీ మొబైల్‌లో ఉంటుంది. ఈ మోడ్‌ను ప్రారంభించిన తర్వాత మీరు మీ డేటాను చాలా వరకు సేవ్ చేయవచ్చు. ఇది కాకుండా తక్కువగా ఉపయోగించే యాప్‌లను తొలగించండి లేదా అన్‌ఇన్‌స్టాల్ చేయండి.
  4. హై క్వాలిటీ వీడియోలు: మీ ఫోన్‌లో వీడియోలను హై క్వాలిటీతో చూడటానికి బదులు నార్మల్‌ క్వాలిటీతో ప్లే చేయండి. హై క్వాలిటీ వీడియోలను ప్లే చేయడం వల్ల మొబైల్ డేటా చాలా త్వరగా ఖర్చవుతుంది.
  5. లోకేషన్ ఆఫ్: చాలా మంది లోకేషన్ ఆప్షన్ గురించి పట్టించుకోరు. లోకేషన్ ఫీచర్ ఆన్‌లో ఉండడం వల్ల కూడా ఇంటర్నెట్ డేటా అయిపోతుంది. కాబట్టి అవసరమైన సమయాల్లో మాత్రమే లోకేషన్‌ను ఆన్ చేయండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..