Huawei P50: హువావే పీ50, పీ50 ప్రో ఫోన్లు విడుదల.. ధర చూస్తే వామ్మో అనాల్సిందే..!

|

Jul 30, 2021 | 11:40 AM

హువావే పీ 50, పీ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు చైనా మార్కెట్‌లో విడుదలయ్యాయి. రెండు ఫోన్‌లలో ప్రత్యేకమైన క్యాప్సూల్ లాంటి బ్యాక్ కెమెరా మాడ్యూల్స్ ఉన్నాయి. ప్రో మోడల్ రెండు ఎస్‌ఓసీ వేరియంట్‌లతో లభించనుంది.

Huawei P50:  హువావే పీ50, పీ50 ప్రో ఫోన్లు విడుదల.. ధర చూస్తే వామ్మో అనాల్సిందే..!
Huawei P50 Pro, Huawei P50
Follow us on

Huawei P50 Pro, Huawei P50: హువావే పీ50, పీ50 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు చైనా మార్కెట్‌లో విడుదలయ్యాయి. రెండు ఫోన్‌లలో ప్రత్యేకమైన క్యాప్సూల్ లాంటి బ్యాక్ కెమెరా మాడ్యూల్స్ ఉన్నాయి. ప్రో మోడల్ రెండు ఎస్‌ఓసీ వేరియంట్‌లతో లభించనుంది. కిరిన్ 9000, స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్లతో ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వెనిల్లా మోడల్ స్నాప్‌డ్రాగన్ 888 మోడల్‌లో మాత్రమే లభించనుంది. రెండు ప్రాసెసర్‌లు 5G కి మద్దతు ఇవ్వనున్నాయి. అలాగే 4G కనెక్టివిటీని అందిస్తాయి. హువావే పీ50 ప్రో మోడల్ ప్రీమియం మోడ్‌లో విడుదలైంది. ఇందులో వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్‌ అందించారు. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా కాగా, 64 మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్‌తో విడుదలయ్యాయి. మరోవైపు, హువావే పీ 50 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులోనూ 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అందించారు.

హువావే పీ50, పీ50 ప్రోల ధర
కొత్త హువావే పీ50 ప్రో 8 జీబీ + 128 జీబీ స్టోరేజ్ మోడల్‌ ధర సీఎన్‌వై 5,988 (సుమారు రూ. 68,800)గా నిర్ణయించారు.అలాగే 8జీబీ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర సీఎన్‌వై 6,488 (సుమారు రూ. 74,500)లు కాగా, 8జీబీ + 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సీఎన్‌వై 7,488 (సుమారు రూ. 86,000)లు ఉంది. జులై 30 నుంచి ప్రీ-ఆర్డర్లు మొదలుకానున్నాయి. అయితే సేల్ మాత్రం ఆగస్టు 8 నుంచి ప్రారంభం కానుంది. ఇది కోకో టీ గోల్డ్, డాన్ పౌడర్, రిప్లింగ్ క్లౌడ్స్, స్నోవీ వైట్, యావో గోల్డ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తున్నాయి.

వీటిలో 12జీబీ + 512జబీ స్టోరేజ్ మోడల్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో కిరిన్ 9000 ఎస్‌ఓసీతో మరో రెండు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకదాని ధర సీఎన్‌వై 7,988 (సుమారు రూ. 91,800)లు కాగా, మరొక మోడల్ సీఎన్‌వై 8,488 (సుమారు రూ .97,500)లుగా నిర్ణయించారు. ఈ రెండూ మోడల్స్ సెప్టెంబర్‌లో అందుటులోకి రానున్నాయి. హువావే పీ 50 ఫోన్ విషయానికి వస్తే.. 8జీబీ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర సీఎన్‌వై 4,488 (సుమారు రూ. 51,600)లు కాగా, 8జీబీ + 128జీబీ మోడల్ ధర సీఎన్‌వై 4,988 (సుమారు రూ. 57,300) ల వద్ద ప్రారంభమవనున్నాయి. ఈ రెండు మోడల్స్ కూడా సెప్టెంబర్‌లో సేల్‌కు రానున్నాయి. ఇందులో కోకో టీ గోల్డ్, స్నోవీ వైట్, యావో గోల్డ్ బ్లాక్ కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

హువావే పీ 50 ప్రో స్పెసిఫికేషన్‌లు
హువావే పీ 50 ప్రో ఫోన్ హార్మొనియోస్ ఓఎస్ 2 (HarmonyOS 2) పై పనిచేయనున్నాయి. ఇందులో 6.6-అంగుళాల ఫుల్-హచ్‌డీ+ ఓఎల్ఈడీ కర్వ్డ్ డిస్‌ప్లే అందుబాటులో ఉంది. 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు, 1440హెర్ట్జ్ హై ఫ్రీక్వెన్సీతో విడుదలైంది. ఇందులో రెండు ప్రాసెసర్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. హైసిలికాన్ కిరిన్ 9000 (HiSilicon Kirin 9000), క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 (Qualcomm Snapdragon 888) ప్రాసెసర్లతో అందుబాటులో ఉండనున్నాయి. హువావే పీ 50 ప్రో 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్‌తో రానుంది. స్టోరేజ్‌ను 256జీబీ వరకు నానో మెమరీ కార్డ్‌ సహాయంతో పెంచుకోవచ్చు.

హువావే పీ 50 ప్రో వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. దీనితో పాటుగా 40 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ లెన్స్, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 64 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం ముందుభాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 4,360mAh బ్యాటరీతో విడుదలైన ఈ ఫోన్ 66వాట్స్ వైర్డ్ సూపర్ ఫాస్ట్ ఛార్జ్, 50వాట్స్ వైర్‌లెస్ సూపర్ ఫాస్ట్ ఛార్జ్‌కు సపోర్ట్ చేయనున్నాయి. ఇందులో 4G, Wi-Fi 802.11 ax, బ్లూటూత్ v5.2, యూఎస్‌బీ Type-C పోర్ట్, ఎన్‌ఎఫ్‌సీ లాంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఈ ఫోన్ బరువు 195 గ్రాములుగా ఉంది.

హువావే పీ 50 స్పెసిఫికేషన్‌లు
హువావే పీ 50 విషయానికొస్తే, ఇది హార్మొనియోస్ 2తో పనిచేయనుంది. ఇందులో 6.5-అంగుళాల పూర్తి-హెచ్‌డీ + తోపాటు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌, ఓఎల్ఈడీ ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 888 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేయనుంది. 8జీబీ ర్మామ్, 256జీబీ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. స్టోరేజ్‌ను నానో మెమరీ కార్డ్‌తో 256జీబీ వరకు పెంచుకోవచ్చు.

హువావే పీ 50లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 13 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం ముందుభాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. హువావే పీ 50లో 4,100mAh బ్యాటరీ అందించారు. ఇది 66వార్ట్స్ వైర్డ్ సూపర్ ఫాస్ట్ ఛార్జ్‌కు సఫోర్ట్ చేయనుంది. ఇందులో హువావే పీ 50ప్రోలో ఉన్నటు వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ 181 గ్రాముల బరువు కలిగి ఉంది.

Also Read: NASA: రహస్యాల శోధనలో నాసా సరికొత్త ముందడుగు..అతి దగ్గరగా సూర్యుని ఫోటో.. సోషల్ మీడియాలో వైరల్!

Motorola Edge 20: ఆగస్టు 5న మోటరోలా ఎడ్జ్ 20 సిరీస్ ఫోన్లు.. లీకైన ఫీచర్లు.. చూస్తే వావ్ అనాల్సిందే…!