Wi-Fi Calling: స్మార్ట్‌ఫోన్‌లలో వైఫై కాలింగ్‌ను ఉపయోగించడం ఎలా..?

|

Feb 07, 2023 | 7:00 AM

మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీ కూడా ఎంతో అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్‌లలో పెద్దగా ఫీచర్స్‌ లేకున్నా.. ఇప్పుడున్న టెక్నాలజీతో కొత్త కొత్త ఫీచర్స్‌ను జోడించి..

Wi-Fi Calling: స్మార్ట్‌ఫోన్‌లలో వైఫై కాలింగ్‌ను ఉపయోగించడం ఎలా..?
Wi Fi Calling
Follow us on

మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీ కూడా ఎంతో అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్‌లలో పెద్దగా ఫీచర్స్‌ లేకున్నా.. ఇప్పుడున్న టెక్నాలజీతో కొత్త కొత్త ఫీచర్స్‌ను జోడించి స్మార్ట్‌ఫోన్లు తయారు చేస్తున్నారు. మనం ఫోన్‌కాల్స్‌ మాట్లాడుతున్న సమయంలో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. వాయిస్‌ సరిగ్గా వినిపించకపోవడం, మధ్య మధ్యలో కట్‌ కావడం రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. ఇక మొబైల్ నెట్‌వర్క్‌ కనెక్టివిటీ తక్కువగా ఉన్న సమయంలో కాల్ డ్రాప్స్ అవుతుంటాయి. సెల్‌ఫోన్ టవర్లకు సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్న యూజర్లకు మాత్రమే కాదు కాల్ డ్రాప్ సమస్య చాలా మందికి ఉంటుంది. కార్యాలయాల లోపల, అండర్ గ్రౌండ్ ప్రాంతంలో ఉన్నప్పుడు సిగ్నల్స్‌ సరిగ్గా అందక ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఆ సమయాల్లో కాల్ కట్ అవడం లేదా అవతలి వ్యక్తి వాయిస్ సరిగ్గా వినిపించకపోవడం వంటి జరుగుతూనే ఉంటాయి. అయితే తక్కువ సిగ్నల్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లోనూ కాల్ డ్రాప్స్ సమస్యలు లేకుండా రెగ్యులర్ ఫోన్ కాల్స్ చేసేందుకు అవకాశం ఉంది. ఇందుకు యూజర్లు వై-ఫై కాలింగ్ ఫీచర్ ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది.

భారత్‌లో ఎయిర్‌టెల్, జియోతో పాటు చాలా టెలికాం సంస్థలు వై-ఫై కాలింగ్‌ సదుపాయాన్ని ఉచితంగా యూజర్లకు అందిస్తున్నాయి. వై-ఫై కాలింగ్ అనేది వై-ఫై నెట్‌వర్క్‌ సాయంతో పనిచేస్తుంది. అందువల్ల బలమైన వై-ఫై సిగ్నల్స్ ఉన్నచోటే ఈ సేవలను ఉపయోగించడం ఇది సాధ్యమవుతుంది. వై-ఫై కాలింగ్‌ అనేది VoLTE (వాయిస్‌ ఓవర్‌ LTE) టెక్నాలజీకి బదులు VoIP (వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌) టెక్నాలజీని యూజ్ చేసి కాల్స్ కనెక్ట్ చేస్తుంది. ఇటీవల కాలంలో విడుదలవుతున్న అన్ని ఫోన్లలో వై-ఫై కాలింగ్‌ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీ ఫోన్‌లో ఈ ఆప్షన్‌ లేకపోతే వైఫై ద్వారా కాల్స్ చేయడం కుదరదు.

ఇవి కూడా చదవండి

మరి వై-ఫై కాలింగ్‌ ఆప్షన్‌ యాక్టివేట్‌ చేయడం ఎలా..?

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు ఇలా చేయండి

  • ఆండ్రాయిడ్ ఫోన్‌లోని సెట్టింగ్స్‌ మెనూకు వెళ్లాలి. తరువాత నెట్‌వర్క్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో నెట్‌వర్క్స్ కి బదులు మొబైల్ నెట్‌వర్క్స్ లేదా కనెక్షన్స్‌ అని ఉంటుంది.
  • నెట్‌వర్క్‌ సెక్షన్‌కు వెళ్లిన తర్వాత వై-ఫై ప్రిఫరెన్స్‌ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తరువాత అడ్వాన్స్‌డ్‌ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
  • వై-ఫై కాలింగ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీ ఫోన్‌లో రెండు సిమ్‌ కార్డులు ఉంటే.. వాటిలో మీకిష్టమైన సిమ్‌ కార్డుకి వైఫై కాలింగ్ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవచ్చు. చాలా ఫోన్లలో నెట్‌వర్క్‌ సెక్షన్‌లోనే వైఫై కాలింగ్ ఫీచర్ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ యూఐ బట్టి ఈ ప్రాసెస్ మారవచ్చు. కొన్ని ఫోన్లలో నేరుగా నోటిఫికేషన్ బార్‌లోనే వైఫై కాలింగ్ ఆప్షన్ ఉంటుంది.

ఐఫోన్ యూజర్లు ఇలా యాక్టివేట్ చేయండి

  • ఐఫోన్‌లోని సెట్టింగ్స్‌కు వెళ్లి ఫోన్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  • ‘మొబైల్‌ డేటా’ పై క్లిక్ చేసి వై-ఫై కాలింగ్‌ సెలెక్ట్ చేసుకోవాలి. మీ టెలికాం ఆపరేటర్‌ సపోర్ట్‌ చేస్తేనే వైఫై కాలింగ్ ఫీచర్ కనిపిస్తుంది.
  • వై-ఫై కాలింగ్‌ ఆన్‌ దిస్‌ ఐఫోన్‌ ఫీచర్ టర్న్ ఆన్ చేయాలి. ఈ ఫీచర్ ఆన్ చేశాక.. మీ ఫోన్‌లోని స్టేటస్‌ బార్‌లో టెలికాం ఆపరేటర్స్ నేమ్( ఉదాహరణకి ఎయిర్‌టెల్) కింద వై-ఫై అని కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత మీరు తక్కువ సిగ్నల్ ఉన్న ప్రాంతాల్లోనూ నిరంతరాయంగా రెగ్యులర్ కాల్స్ మాట్లాడుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి