ప్రస్తుతం మనం ఉన్న ఈ టెక్నాలజీ యుగంలో డిజిటల్ చెల్లింపుల హవా నడుస్తోంది. గతంలో లాగా గంటల తరబడి లైన్లలో నిల్చొని బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేకుండా.. ఇంట్లోనే కాళ్లు కదపకుండా పనులన్నీ పూర్తి చేసే సౌకర్యం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అందుకే డిజిటల్ చెల్లింపులకు, ఆ సేవలను అందించే యాప్‌లకు ఆదరణ పెరుగుతోంది. గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే, భీమ్ వంటి పలు యాప్స్ డిజిటల్ చెల్లింపులకు ఉపయోగకరంగా నిలుస్తున్నాయి. ఈ యాప్‌లు విద్యుత్ బిల్లు చెల్లింపు, డీటీహెచ్ రీచార్జ్, మొబైల్ రీచార్జ్, గ్యాస్ బుకింగ్, మెట్రో కార్డ్ రీఛార్జ్‌లతో పాటు అనే సర్వీసులను అందిస్తున్నాయి. ఆ క్రమంలోనే మీ నెలవారీ విద్యుత్ బిల్లును BHIM, పేటీఎం, ఫోన్‌పే ఉపయోగించి ఎలా చెల్లించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
భీమ్(BHIM): మీ ఫోన్లో BHIM యాప్‌ను ఇన్స్టాల్ చేసి.. మీ బ్యాంక్ అకౌంట్‌ను యాడ్ చేయండి. ఇలా చేయడం ద్వారా కేవలం రెండు నిమిషాల్లోనే మీ విద్యుత్ బిల్లును చెల్లించవచ్చు. BHIM యాప్‌లోని స్క్రీన్ మధ్యలో ఉన్న ‘పే బిల్స్’పై క్లిక్ చేసి.. దానిలోని ‘ఎలక్ట్రిసిటీ బిల్’ ఆప్షన్‌ను ఎంచుకోండి. తరువాత మీ రాష్ట్ర పరిధిలోని విద్యుత్ డిస్ట్రిబ్యూటర్(TSSPDCL/ APSPDCL)ను ఎంచుకోండి. ఇన్పుట్ బాక్స్‌లో మీ యూజర్ ఐడీని ఎంటర్ చేయండి. దీంతో అక్కడ మీరు చెల్లించాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ చూపిస్తుంది. మీ యూపీఐ పిన్‌తో బిల్ పేమెంట్ పూర్తి చేయండి. ఆ వెంటనే మీ బిల్ పేమెంట్ పూర్తయినట్లు మీ మొబైల్‌కు మెసేజ్ వస్తుంది.
పేటీఎం(Paytm): పేటీఎం యాప్ ద్వారా కూడా సులభంగా మీ విద్యుత్ బిల్లును చెల్లించవచ్చు. ముందుగా పేటీఎం యాప్‌ని ఓపెన్ చేసి యాప్ హోమ్‌పేజీలో రీఛార్జ్, బిల్ పేమెంట్ విభాగంలోకి వెళ్లండి. ఆ తర్వాత ‘ఎలక్ట్రిసిటీ బిల్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీ రాష్ట్ర పరిధిలోని ఎలక్ట్రిసిటీ బోర్డ్(TSSPDCL/ APSPDCL)ను ఎంచుకోండి. ఆ తర్వాత మీ యూజర్ ఐడీని ఎంటర్ చేసి కంటిన్యూపై క్లిక్ చేయండి. బ్యాలెన్స్ బిల్ అమౌంట్ చూపిస్తుంది. మీ యూపీఐ ఐడీతో పేమెంట్ పూర్తి చేయండి. ఆపై మీకు బిల్లింగ్ పూర్తయినట్లు మెసేజ్ వస్తుంది.
ఫోన్ పే(PhonePe): ఫోన్‌పే ద్వారా కరెంట్ బిల్ చెల్లించడానికి.. యూజర్లు ముందుగా తమ యాప్ ఓపెన్ చేసి ‘రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దానిలో ఎలక్ట్రిసిటీ బిల్ ఆప్షన్‌ను కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత మీ బిల్లర్ పేరును టాప్ సెర్చ్ బార్లో ఎంటర్ చేయండి. తర్వాత మీ కన్స్యూమర్ ఐడీని టైప్ చేసి, కన్ఫర్మ్ చేయండి. మీరు చెల్లించాల్సిన బ్యాలెన్స్ మొత్తం చూపిస్తుంది. మీ యూపీఐ పిన్ ఎంటర్ చేసి, పేమెంట్ పూర్తి చేయండి. ఆపై మీ ఫోన్‌కు మెసేజ్ వస్తుంది.
గూగుల్ పే(Google Pay): ఇతర యూపీఐ యాప్స్ లాగానే గూగుల్ పేలో సైతం ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయవచ్చు. అందుకోసం ముందుగా యాప్ హోమ్ స్క్రీన్‌పై కనిపించే ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ ఎలక్ట్రిసిటీ బోర్డ్‌ను ఎంచుకొని కన్స్యూమర్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ యూపీఐ ఐడీ ఉపయోగించి బ్యాలెన్స్ అమౌంట్‌ను చెల్లించండి. తద్వారా మీ ఎలక్ట్రిసిటీ బిల్లింగ్ పూర్తయినట్లే. గూగుల్ పేతో సహా పై అన్ని యాప్స్‌లలో ఆటో పే ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..