Smart watch: స్మార్ట్ వాచ్‌లు రక్తపోటును ఎలా కొలుస్తాయి.? ఇందులో ఉన్న టెక్నాలజీ ఏంటంటే..

|

Aug 09, 2024 | 5:42 PM

ఒక వ్యక్తి బీపీని చెక్ చేయాలంటే కచ్చితంగా బీపీ మిషన్ ఉండాలనే విషయం తెలిసిందే. బీపీ మిషిన్‌లో ఉండే కఫ్‌ని చేతికి చూడతారు. అనంతరం అందులోకి గాలిని నింపడం వల్ల చేతుల్లోని నరాలపై ఒత్తిడి పడుతుంది. దీంతో ఇది శరీరంలో ప్రవహిస్తున్న రక్తం వేగాన్ని అంచనా వేస్తుంది. సిస్టోలిక్‌, డయాస్టొలిక్‌ రక్తపోటు రీడింగ్‌లను మీటర్‌లో చూపిస్తుంది...

Smart watch: స్మార్ట్ వాచ్‌లు రక్తపోటును ఎలా కొలుస్తాయి.? ఇందులో ఉన్న టెక్నాలజీ ఏంటంటే..
Smartwatch BP
Follow us on

ఒక వ్యక్తి బీపీని చెక్ చేయాలంటే కచ్చితంగా బీపీ మిషన్ ఉండాలనే విషయం తెలిసిందే. బీపీ మిషిన్‌లో ఉండే కఫ్‌ని చేతికి చూడతారు. అనంతరం అందులోకి గాలిని నింపడం వల్ల చేతుల్లోని నరాలపై ఒత్తిడి పడుతుంది. దీంతో ఇది శరీరంలో ప్రవహిస్తున్న రక్తం వేగాన్ని అంచనా వేస్తుంది. సిస్టోలిక్‌, డయాస్టొలిక్‌ రక్తపోటు రీడింగ్‌లను మీటర్‌లో చూపిస్తుంది.

సహజంగా వైద్యులు బీపీని చెక్‌ చేసే విధానం ఇదే. అయితే ఇదే సమయంలో వైద్యులు రక్త ప్రవాహంలో వచ్చే మార్పులు, శబ్ధాలను గమనించేందుకు స్టెతస్కోప్‌ లేదా ఎలక్ట్రానిక్‌ సెన్సార్‌ను ఉపయోగిస్తుంటారు. వీటి ఆధారంగా సదరు వ్యక్తి రక్తపోటు ఎంత ఉందన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. అయితే ప్రస్తుతం స్మార్ట్‌ వాచ్‌లో కూడా బీపీని తెలుసుకుంటారు. స్మార్ట్‌ వాచ్‌ తయారీ కంపెనీలు సైతం ఇలాంటి ఫీచర్లతో కూడిన వాచ్‌లను తీసుకొస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో స్మార్ట్‌ వాచ్‌లో వచ్చిన అలర్ట్స్‌ ఆధారంగా వ్యక్తుల ప్రాణాలు నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అయితే స్మార్ట్ వాచ్‌లు బీపీని ఎలా గుర్తిస్తాయన్న సందేహం మనలో ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ఇంతకీ స్మార్ట్‌ వాచ్‌ బీపీని ఎలా గుర్తిస్తుంది. ఇందులో ఉపయోగించే టెక్నాలజీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రక్తపోటును అంచనా వేయడానికి స్మార్ట్‌ వాచ్‌లు, ఫిట్‌నెస్ ట్రాకర్‌లు ఫోటోప్లెథిస్మోగ్రఫీ (PPG) అని పిలిచే సెన్సార్‌లను ఉపయోగిస్తున్నారు. వీటి సహాయంతో రక్తపోటును అంచనా వేయొచ్చు. పీపీజీ అనేది రక్త ప్రవాహాన్ని కాంతి ద్వారా అంచనా వేస్తుంది. స్మార్ట్ వాచ్‌ అడుగున లైట్‌ ఉండడానికి కారణం ఇదే.

స్మార్ట్‌వాచ్‌లోని సెన్సార్‌లు చర్మంలోకి కాంతిని విడుదల చేస్తాయి. ఇవి మణికట్టులోని రక్తనాళాల్లో రక్త ప్రవాహాన్ని కొలుస్తాయి. రక్తనాళాలలో ప్రవహిస్తున్న రక్త ప్రవాహంలో మార్పులను విశ్లేషించడం ద్వారా రక్తపోటును అంచనా వేస్తాయి. అయితే స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ ట్రాకర్‌లలో చూపించే రక్తపోటు కొలతల్లో 100 శాతం నిజం ఉంటుందా.? అంటే కచ్చితంగా అవుననే సమాధానం చెప్పలేమని నిపుణులు అంటున్నారు. స్మార్ట్‌వాచ్‌లలో వచ్చే రీడింగ్స్‌ను గుడ్డిగా నమ్మలేమని, కచ్చితంగా వైద్యుల సూచనలు పాటించాలని అంటున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..