Honor 200: హానర్ నుంచి కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. కళ్లు చెదిరే ఫీచర్లు..
హానర్ 200 స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ కర్వ్డ్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 2664×1200 పిక్సల్స్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రిన్ సొంతం. ఇక ఈ ఫోన్‌లో ఫోన్ 100% డీసీఐ-పీ3 కలర్ గేమట్, 4,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ 3,840 హెర్ట్జ్ పీడబ్ల్యుఎమ్ డిమ్మింగ్న్ వంటి అధునాతన ఫీచర్లను..

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం హానర్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. హానర్ 200 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. హానర్ 200 సిరీస్‌లో భాగంగా హానర్ 200, హానర్ 200 ప్రో పేర్లతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఇప్పటికే చైనాలో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
హానర్ 200 స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ కర్వ్డ్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 2664×1200 పిక్సల్స్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రిన్ సొంతం. ఇక ఈ ఫోన్‌లో ఫోన్ 100% డీసీఐ-పీ3 కలర్ గేమట్, 4,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ 3,840 హెర్ట్జ్ పీడబ్ల్యుఎమ్ డిమ్మింగ్న్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు. గ్రాఫిక్స్‌కు సంబంధించి అడ్రినో 720 జీపీయూను ఇచ్చారు.
ఈ స్మార్ట్ ఫోన్‌లో 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన సోనీ ఐఎంఎక్స్ 906 ప్రైమరీ సెన్సార్, 112 మెగాపిక్సెల్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ (ఎఫ్ఓవీ)తో 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2.5ఎక్స్ లాస్లెస్ జూమ్‌తో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరాలను అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.
కాగా ఈ ఫోన్‌లో 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5200 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే మ్యాజిక్ ఓఎస్ 8.0 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. స్క్రీన్ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన ఓఎల్‌ఈడీ ప్యానెల్‌ను అందించారు. 16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక ధర విషయానికొస్తే 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 30,000గా నిర్ణయించారు. అలాగే 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 40,000గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..